Share News

ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ ప్రోత్సాహం

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:05 AM

పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఉమ్మడి మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ ఆర్థిక సాయంతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ ప్రోత్సాహం

  • ఎస్‌ఐసీసీఐ వార్షిక సదస్సులో మంత్రి కొండపల్లి

అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఉమ్మడి మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ ఆర్థిక సాయంతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం చెన్నైలోని హోటల్‌ లీలా ప్యాలె్‌సలో నిర్వహించిన దక్షిణ భారత చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎస్‌ఐసీసీఐ)116వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మంత్రి కొండపల్లి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ఇండియా-ఈయూ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ (ఎఫ్‌టీఏ), ఎన్‌ఆర్‌ఐ వర్గాల సహకారంతో స్థానిక పరిశ్రమల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడమే ఏపీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఎస్‌ఐసీసీఐ అధ్యక్షుడు అరుణ్‌ అలగప్పన్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.ఎన్‌.శివశంకర్‌, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

పోరంబోకులో ప్రహరీ తొలగింపు

సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని

Updated Date - Sep 02 , 2026 | 04:05 AM