Share News

బీసీ హాస్టళ్లు, గురుకులాల డైట్ ఛార్జీల పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ABN , Publish Date - Oct 01 , 2026 | 08:25 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ హాస్టళ్లు, గురుకులాల డైట్ ఛార్జీలను పెంచింది. ఈ నిర్ణయంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత హర్షం వ్యక్తం చేశారు.

బీసీ హాస్టళ్లు, గురుకులాల డైట్ ఛార్జీల పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
diet charges

అమరావతి, అక్టోబర్ 1: రాష్ట్రంలో బీసీ హాస్టళ్లు, గురుకులాల డైట్ ఛార్జీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఇవాళ (గురువారం) ఉత్తర్వులు జారీ చేసింది. 3 నుంచి 6వ తరగతి విద్యార్థుల డైట్ ఛార్జీలను రూ.1150 నుంచి రూ.1265కు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1400 నుంచి రూ.1600కు ఛార్జీలను పెంచినట్టు వెల్లడించింది. అలాగే ఇంటర్, ఆపై తరగతి విద్యార్థులకు రూ.1600 నుంచి రూ.1800కు పెంచింది.


పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా నూతన మెనూ అమలవుతుందని ప్రభుత్వం తెలిపింది. వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడు రోజులు చికెన్, రోజూ పాలు, పండ్లు విద్యార్థులకు అందజేయాలని అధికారులను ఆదేశించింది. కాగా డైట్ ఛార్జీల పెంపుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ద్వారా బీసీ విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించే వీలుకలుగుతుందని ఆమె పేర్కొన్నారు. హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు ఆహారభద్రత దొరుకుతుందని చెప్పారు. డైట్ ఛార్జీల పెంచినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలూ చదవండి

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశం

రెండేళ్లలో అధికమొత్తంలో నిధులు కేటాయించాం: మంత్రి నారాయణ

Updated Date - Oct 01 , 2026 | 08:47 PM