రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ దిమ్మెల ధ్వంసం
ABN , Publish Date - Mar 28 , 2026 | 10:52 AM
కదిరిలో టీడీపీ దిమ్మెలను వైసీపీ నేతలు ధ్వంసం చేయడం వివాదానికి దారి తీసింది. వైసీపీ నేతలు మితిమీరి ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా, మార్చి 28: ఏపీలో వైసీపీ నేతలు(YCP Leaders) మరోసారి రెచ్చిపోయారు. కదిరి మున్సిపాలిటీ కుటాగుళ్ల ప్రాంతంలోని మూడు వార్డుల్లో టీడీపీ దిమ్మెలను ధ్వంసం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన దిమ్మెలను వైసీపీ నేతలు ధ్వంసం చేయడం స్థానికంగా తీవ్ర వివాదానికి దారితీసింది. వైసీపీ జిల్లా కార్యదర్శి ప్రణీత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మహమ్మద్, వైసీపీ నేత సురేశ్ రెడ్డి ప్రోద్భలంతోనే దిమ్మెలను ధ్వంసం చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న కదిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన టీడీపీ పార్టీ దిమ్మెలను పరిశీలించారు. వైసీపీ పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోయాయని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఎర్త్ అవర్.. హైదరాబాద్ వాసులకు జీహెచ్‌ఎంసీ పిలుపు
ఏపీలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు నయా రూల్స్.. తప్పక పాటించాల్సిందే
Read Latest AP News And Telugu News