Share News

అనంతపురం జిల్లాలో బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికులకు గాయాలు

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:30 AM

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామనేపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఈ బస్సు బయలు దేరింది. ఈ ఘటనలో 30 నుంచి 40 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

అనంతపురం జిల్లాలో బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..  ప్రయాణికులకు గాయాలు
Anantapur Bus Accident

అనంతపురం జిల్లా, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామనేపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఈ బస్సు బయలు దేరింది. ఈ ఘటనలో 30 నుంచి 40 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉన్నారు.


డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా ప్రయాణికులు చెబుతున్నారు. గాయపడిన స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Nov 19 , 2026 | 06:51 AM