Share News

వైసీపీకి హిందూపురం మాజీ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ రాజీనామా

ABN , Publish Date - Sep 25 , 2026 | 07:59 PM

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీకి వరుసగా షాకులు మీద షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

వైసీపీకి హిందూపురం మాజీ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ రాజీనామా

అమరావతి, సెప్టెంబర్ 25: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీకి వరుసగా షాకులు మీద షాకులు తగులుతున్నాయి. రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా హిందూపురం వైసీపీ మాజీ అధ్యక్షుడు బుక్కపట్నం నవీన్ నిశ్చల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం వైసీపీ అధిష్ఠానానికి ఆయన ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖ పంపారు. అయితే ఏడాది క్రితం ఆయనపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.


తాజాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నవీన్ నిశ్చల్ బహిరంగ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో హిందూపురం రాజకీయాల్లో ఆయన పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గతంలో హిందూపురం నుంచి స్వతంత్ర, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుసగా రెండు సార్లు బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆగ్రోస్ చైర్మన్‌గా నవీన్ నిశ్చల్ పనిచేశారు. వైసీపీకి రాజీనామా చేయడంతో నవీన్ నిశ్చల్ భవిష్యతు కార్యాచరణపై పుట్టపర్తి జిల్లాలో ఆసక్తి నెలకొంది. హిందూపురం రాజకీయాల్లో నవీన్ నిశ్చల్ రాజకీయ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి..

ఆత్మకూరు కేజీబీవీ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

వైసీపీకి యనమల కృష్ణుడు రాజీనామా.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 25 , 2026 | 08:15 PM