అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు
ABN , Publish Date - Nov 13 , 2026 | 07:14 PM
అనకాపల్లి జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభాన్ని ఓ కారు బలంగా ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. ఈ ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అనకాపల్లి, నవంబర్ 13: పండగ పూట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగుల చవితిని పురస్కరించుకుని సముద్ర స్నానానికి వెళ్లి వస్తుండగా.. ఓ కారు.. విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నాగుల చవితిని పురస్కరించుకుని.. ఓ కుటుంబం కారులో సముద్ర స్నానానికి వెళ్లి వస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు.. ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు.. క్షతగాత్రులను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా.. ఈ ప్రమాదంపై హోంమంత్రి వంగపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహారాష్ట్రలో రన్వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..
ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన