-
-
Home » Andhra Pradesh » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 19th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 19 , 2026 | 07:29 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 19, 2026 12:00 IST
ఢిల్లీ: ఫిక్కీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక కామెంట్స్..
12–13 ఏళ్లలో 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు: ప్రధాని
ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావించిన ప్రధాని మోదీ
పేదరిక నిర్మూలనలో భారత్ సాధించిన పురోగతిని ప్రస్తావించిన ప్రధాని
-
Nov 19, 2026 11:00 IST
హైదరాబాద్: నేడు కూకట్‌పల్లి ట్రక్‌పార్క్ భూములపై సమావేశం
ప్రెస్‌క్లబ్‌లో సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం
సమావేశానికి హాజరుకానున్న మాజీమంత్రి హరీశ్‌రావు
-
Nov 19, 2026 11:00 IST
ఢిల్లీ IGI ఎయిర్‌పోర్ట్‌లో కలకలం
టెర్మినల్-3లోకి ఓ వ్యక్తి చొరబాటు యత్నం
టికెట్, ఐడీ లేకుండా లోపలికి వెళ్లేందుకు యత్నం
CISF అదుపులో నిందితుడు, హరియాణా వాసిగా గుర్తింపు
బ్యాగ్‌లో పలు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్ల స్వాధీనం
-
Nov 19, 2026 10:45 IST
చండీగఢ్: పంజాబ్‌లో కుప్పకూలిన భాక్రా కాలువ ఇనుప వంతెన
ప్రమాద సమయంలో వంతెనపై ఉన్న రెండు భారీ ట్రక్కులు
ట్రక్కుల్లో చిక్కుకున్న డ్రైవర్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సహాయక సిబ్బంది
అధిక బరువు కారణంగానే వంతెన కూలిందని భావిస్తున్న అధికారులు
-
Nov 19, 2026 10:30 IST
భారత్‌తో తొలి టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట..
ఆట ముగిసే సమయానికి కివీస్ స్కోర్ 243/5
హెన్రీ నికోల్స్(113*) అజేయ సెంచరీ
సెంచరీకి చేరువలో గ్లెన్ ఫిలిప్స్(94*)
బుమ్రాకు 3, అన్షుల్ కాంబోజ్, ఆకాశ్ దీప్‌లకు తలొక వికెట్
-
Nov 19, 2026 10:15 IST
ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
25 జిల్లాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు
నవంబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల దాఖలుకు ఈ నెల 23 వరకు గడువు
ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన
-
Nov 19, 2026 10:00 IST
భారత్ సరికొత్త ఆట ఆడుతోంది: ప్రధాని మోదీ
ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ తెఫ్ట్ ఆటో (GTA)-6 వీడియో గేమ్ విడుదలైన వేళ మోదీ ఆసక్తికర పోస్ట్
13 ఏళ్ల నిరీక్షణ తర్వాత GTA-6 కొత్త వెర్షన్ విడుదల
2013లో GTA-5 విడుదలైనప్పటి నుంచి 2026లో GTA-6 విడుదలయ్యే వరకు భారత్‌లో చోటుచేసుకున్న మార్పులపై మోదీ పోలిక
అంతర్జాతీయంగా భారత్ సాధించిన ప్రగతిని వివరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రధాని
-
Nov 19, 2026 09:45 IST
అజీత్ డోభాల్, ‘రా’ మాజీ చీఫ్ సామంత్ గోయెల్‌కు అమెరికా కోర్టు సమన్లు
సమన్లు అందజేసేందుకు సహకరించాలని ఢిల్లీలోని మూడు జిల్లా కోర్టులను కోరిన అమెరికా న్యాయస్థానం
పటియాలా హౌస్, ద్వారక, తీస్ హజారీ కోర్టులకు అంతర్జాతీయ పోస్టు లేదా కొరియర్ ద్వారా పత్రాలు పంపాలని ఆదేశం
ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ దాఖలు చేసిన సివిల్ కేసులో ఈ పరిణామం
హెగ్ కన్వెన్షన్ ద్వారా సమన్లు అందజేసే ప్రయత్నం విఫలం కావడంతో ప్రత్యామ్నాయ విధానానికి అమెరికా కోర్టు అనుమతి
-
Nov 19, 2026 09:30 IST
నేడు తెలంగాణలో కొత్త పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ
తెలంగాణలో 4.5 లక్షల మందికి కొత్త పెన్షన్ల మంజూరు
నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ డబ్బులు
కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరట
ఇప్పటికే 4.5 లక్షల మందికి మంజూరు పత్రాల పంపిణీ పూర్తి
గతంలో మంజూరైన 1,23,625 పెన్షన్లకు అదనంగా కొత్త పెన్షన్లు
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లతో పెరిగిన లబ్ధిదారుల సంఖ్య 5,73,625
-
Nov 19, 2026 09:00 IST
భారత జట్టుకు 35 శాతం మ్యాచ్ ఫీజు కోత
న్యూజిలాండ్‌తో ఐదో వన్డేలో పెనాల్టీ
నిర్ణీత సమయానికి 7 ఓవర్లు తక్కువగా వేసిన భారత్
ఓవర్‌కు 5 శాతం చొప్పున జరిమానా విధింపు
-
Nov 19, 2026 09:00 IST
లఖ్‌నవూ: అఖిలేశ్ యాదవ్ రోడ్‌షోలో విషాదం
బుల్డోజర్ ఢీకొని 12 ఏళ్ల బాలుడి మృతి
బీజేపీ నేత ఓంకార్ సింగ్ కుమారుడు ఆర్యవర్ధన్ సింగ్ దుర్మరణం
పూల వర్షం కురిపిస్తున్న బుల్డోజర్ వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం
బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు, బీజేపీ నేతల ఆందోళన
-
Nov 19, 2026 08:45 IST
నేడు ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ త్రైపాక్షిక భేటీ
ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ సంక్షోభంపై చర్చించే అవకాశం
అణ్వాయుధ నియంత్రణ, ఏఐపై చర్చించనున్న నేతలు
అంతర్జాతీయ వాణిజ్య స్థిరత్వంపైనా చర్చించే అవకాశం
-
Nov 19, 2026 08:30 IST
నేటి నుంచి ఏపీలో ఎంపీటీసీల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం
ఇవాళ ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక
రేపటి నుంచి జడ్పీటీసీల పదవీకాలం ప్రారంభం
రేపు జడ్పీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు
కోఆప్టెడ్ సభ్యుల పదవీకాలం కూడా ఐదేళ్లు
-
Nov 19, 2026 08:00 IST
నేడు సిద్దిపేటలో యంగ్ ఇండియా స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
దుబ్బాక, సిద్దిపేటలో రూ.200 కోట్లతో స్కూళ్లు
6 తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన
జిల్లాలో 14 విద్యుత్ సబ్‌స్టేషన్ల ప్రారంభం
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో వసతి సత్రంతో పాటు క్యూకాంప్లెక్స్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Nov 19, 2026 07:45 IST
నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
రూ.544 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
రూ.92 కోట్ల పనులను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
-
Nov 19, 2026 07:30 IST
హైదరాబాద్: నేటి నుంచి 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశం
IRC ప్రారంభోత్సవానికి నితిన్‌గడ్కరీ, సీఎం రేవంత్‌రెడ్డి
రోడ్ల అభివృద్ధిలో కొత్త టెక్నాలజీపై చర్చ
రెండేళ్లలో రూ.93 వేల కోట్లతో రోడ్ల నిర్మాణమే టార్గెట్
-
Nov 19, 2026 07:00 IST
బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అక్వాన్' తీవ్ర తుపాను
రేపు మధ్యాహ్నం నర్సాపూర్ - పూరీ ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం
ఉత్తరాంధ్ర, యానాం, దక్షిణా ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్
-
Nov 19, 2026 06:30 IST
హైదరాబాద్: డిసెంబరు 29న తానా పురస్కారాల ప్రదానోత్సవం
శిల్పకళా వేదికలో జరగనున్న పురస్కారాల ప్రధానోత్సవం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Nov 19, 2026 06:15 IST
పల్నాడు: దాచేపల్లి మండలం గామాలపాడు దగ్గర రోడ్డు ప్రమాదం
డీసీఎం - కంటెయినర్ ఢీ,
ముగ్గురి మృతి, పలువురికి తీవ్రగాయాలు
మృతులు క్రోసూరు మండల వాసులు