Thuni School Girl Incident: బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నం.. చితకబాదిన జనం
ABN, Publish Date - Oct 22 , 2025 | 05:13 PM
కాకినాడ జిల్లా తునిలో ఓ బాలికపై అత్యాచార యత్నం కలకలం రేపింది. నారాణయరావు అనే వృద్ధుడు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
కాకినాడ జిల్లా తునిలో ఓ బాలికపై(Thuni School Girl Incident) అత్యాచార యత్నం కలకలం రేపింది. నారాణయరావు అనే వృద్ధుడు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను బాలికపై అత్యాచార యత్నం చేయలేదంటూ సదరు వ్యక్తి వాదిస్తున్నాడు. బాలిక బంధువుల ఫిర్యాదుతో పోలీసులు నారాయణ రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని శిక్షించాలంటూ గురుకుల పాఠశాల వద్ద బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. ఇదే తరహా ఘటన రాజమండ్రిలో కూడా చోటుచేసుకుంది. బాలికల వసతి గృహంలో(Girls Hostel) ఉండే విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు.
ఇవి కూడా చదవండి..
టికెన్ కొని మెట్రో ఎక్కాడు.. లోపల అతడు చేసిన పనికి అంతా షాక్..
రాత్రి వేళ సంబరాల్లో యువతీయువకులు.. అర్ధరాత్రి రోడ్డు మధ్యలో షాకింగ్ సీన్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Oct 23 , 2025 | 09:13 AM