Samosa Seller Attacks On Passenger: రైల్వే ప్రయాణికుడిపై సమోసా వ్యాపారి దాడి

ABN, Publish Date - Oct 21 , 2025 | 09:33 PM

ఫోన్ పే పనిచేయడం లేదని చెప్పినా వినిపించుకోకుండా రైల్వే ప్రయాణికుడిపై సమోసాలను విక్రయించే వ్యక్తి దాడి చేశాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్‌మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు సమోసా వ్యాపారిపై కేసు నమోదు చేశారు.

మధ్యప్రదేశ్, అక్టోబర్ 21: ఫోన్ పే పనిచేయడం లేదని చెప్పినా వినిపించుకోకుండా రైల్వే ప్రయాణికుడిపై సమోసాలను విక్రయించే వ్యక్తి దాడి చేశాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్‌మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు సమోసా వ్యాపారిపై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో(Jabalpur Railway Station) శుక్రవారం సాయంత్రం ఓ ప్రయాణికుడు సమోసా కొనుగోలు చేశాడు. అయితే ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించగా.. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యింది. ఇంతలో తాను వెళ్లాల్సిన రైలు బయల్దేరడంతో.. ఆ ప్రయాణికుడు సమోసాను తిరిగి ఇచ్చేశాడు. దీంతో ఆగ్రహించిన సమోసాల విక్రేత(samosa vendor fight) ప్రయాణికుడిపై దాడికి దిగాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. సదరు రైల్వే వ్యాపారిపై కేసు నమోదు చేశారు.



ఇవి కూడా చదవండి..

విభేదాల వేళ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన కిరణ్ మజుందార్

12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated at - Oct 21 , 2025 | 09:39 PM