Posani Arrest : జైల్లో పోలీసులను భయపెట్టిన పోసాని.. అసలు విషయం ఇదే...
ABN, Publish Date - Mar 01 , 2025 | 08:26 PM
Posani Health Police says : సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజంపేట సబ్ జైల్లో ఆరోగ్యం బాగాలేదంటూ లబోదిబోమంటూ గోల చేయడంతో హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పోసాని అనారోగ్యం పేరుతో ..
Posani Health Police : టీడీపీ, జనసేన పార్టీ అధినేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను రెండు రోజుల క్రితం సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని అన్నమయ్య పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం రాజమండ్రి సబ్ జైలుకు తరలించారు. అయితే, మొదట ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మళ్లీ ఛాతీ నొప్పి అంటూ చెప్పడంతో కడప రిమ్స్ ఆస్పత్రికి పంపించాక అసలు విషయం బయటపడినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
Updated at - Mar 01 , 2025 | 08:31 PM