Vidadala Rajini: విడదల రజిని విశ్వరూపం.. ఫ్యాన్ పార్టీలో బిగ్ ట్విస్ట్
ABN, Publish Date - Feb 11 , 2025 | 02:30 PM
YSRCP: వైసీపీ మాజీ మంత్రి విడదల రజినీ విశ్వరూపం చూపిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ బడా నేతలకు దడ పుట్టిస్తున్నారు. అసలు ఆమె ఏం చేస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
గుంటూరు: ఏపీలో ఇప్పుడు పల్నాడు జిల్లా రాజకీయాల గురించి బాగా చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడినప్పటి నుంచి ఆ జిల్లాలోని బడా నాయకులంతా సైలెంట్‌గా ఉంటున్నారు. ఎవరి వ్యాపారాలు వాళ్లు చూసుకుంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో వైసీపీ క్యాడర్‌లో నిరాశ, నిరుత్సాహం కనిపిస్తోంది. అయితే మాజీ మంత్రి విడదల రజిని ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మీద ఆరోపణలు సంధిస్తున్నారు. అలాగే తమ పార్టీ క్యాడర్‌ను కలుస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నారు. దీంతో మిగతా నియోజకవర్గాల్లో క్యాడర్ తమ పరిస్థితి తలచుకొని మదనపడుతోంది.
ఇవీ చదవండి:
గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
ఈ పథకాన్ని సమర్ధవంతంగా వాడుకోవాలి: సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లాలో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య
మరిన్ని ఏపీ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated at - Feb 11 , 2025 | 02:38 PM