AP NEWS: మాకు రోడ్లు కావాలి.. డోలీలతో గిరిజనుల నిరసన
ABN, Publish Date - Jan 20 , 2025 | 09:23 PM
అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద డోలీలతో గిరిజనులు వినూత్న నిరసనకు సోమవారం నాడు దిగారు. డోలీలు మోస్తు ర్యాలీలు నిర్వహించారు.
అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద డోలీలతో గిరిజనులు వినూత్న నిరసనకు సోమవారం నాడు దిగారు. డోలీలు మోస్తు ర్యాలీలు నిర్వహించారు. రావికమతం వి. మడుగుల, వెలుగొండ మండలాల్లోని పలు గ్రామాల్లో రోడ్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు శంకుస్థాపన దశలోనే నిలిచిపోయాయి. అయితే పలు గ్రామాలకు రోడ్లు వేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారని గిరిజనులు ఆరోపించారు.
గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం లేకపోవడంతో గర్బిణులు అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పిల్లలు స్కూల్‌కు వెళ్లిరావడానికి కూడా చాలా ఇబ్బందిగా మారిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు కల్పించుకుని తక్షణమే రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని గిరిజనులు హెచ్చరించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి..
జమ్మూలో వింత వ్యాధి.. వరుస మరణాలు..
వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 20 , 2025 | 09:52 PM