జమ్మూలో వింత వ్యాధి.. వరుస మరణాలు
ABN, Publish Date - Jan 20 , 2025 | 01:43 PM
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో వింత వ్యాధితో వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బఢాల్ గ్రామంలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది గుర్తు తెలియని వ్యాధితో మృతి చెందడం సంచలనంగా మారింది.
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో వింత వ్యాధితో వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బఢాల్ గ్రామంలో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది గుర్తు తెలియని వ్యాధితో మృతి చెందడం సంచలనంగా మారింది. దీంతో ఈ మిస్టరీ మరణాలపై కేంద్రం అప్రమత్తమైంది. అసలు ఏం జరుగుతుందో తేల్చేందుకు కేంద్ర బృందం ఒకటి బఢాల్ గ్రామానికి చేరుకుంది. గత ఏడాది డిసెంబర్ 7న ఒక కుటుంబానికి చెందిన 7గురు ఓ విందుకు హాజరై వచ్చాక అనారోగ్యం పాలయ్యారు. వారిలో ఐదుగురు మరణించారు. అదే నెల 12న వారి బంధువులు 9 మంది అనారోగ్యం పాలయ్యారు. వారిలో ముగ్గురు కన్నుమూశారు.
ఈ వార్త కూడా చదవండి..
నాగర్‌కర్నూల్ జిల్లా: మైలారంలో ఉద్రిక్తత
ఇక ఈ నెల (జనవరి)12న ఒక కుటుంబానికి చెందినవారు మరో విందుకు హాజరై వచ్చాక అనారోగ్యం పాలయ్యారు. వారిలో కూడా కొందరు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 17కు చేరింది. జ్వరం, కడుపులో తిప్పడం, ఒళ్లు నొప్పులు తదితర సాధారణ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన బాధితులు.. ఆ తర్వాత కొన్ని వారాలకే కన్ను మూశారు. వారి అనారోగ్యం ఏంటనేది వైద్యులకు కూడా మిస్టరీగా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టు రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త
వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 20 , 2025 | 01:43 PM