Trump Meet Pakistan PM: ట్రంప్ తో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ రహస్య భేటీ

ABN, Publish Date - Sep 26 , 2025 | 01:18 PM

అమెరికా, పాకిస్తాన్ రోజురోజుకూ మరింత చేరువవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో బేటీ అయ్యారు. వైట్‌హౌస్‌లో వీరి మధ్య అంతర్గత సమావేశం జరిగింది.

అమెరికా, పాకిస్తాన్ రోజురోజుకూ మరింత చేరువవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో బేటీ అయ్యారు. వైట్‌హౌస్‌లో వీరి మధ్య అంతర్గత సమావేశం జరిగింది. ఆ సమయంలో షరీఫ్ వెంట మునీర్ కూడా ఉన్నారు. ఈ బేటీకి మీడియాను అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది.


అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం పాక్ ప్రధాని బృందం వైట్‌హౌస్‌కు చేరుకుంది. ఆ సమయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతున్నారు. దీంతో దాదాపు గంట పాటు అమెరికా అధ్యక్షుడి కోసం పాక్ నేతలు ఎదురు చూశారు. అటు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. షరీఫ్ గురించి ప్రస్తావించారు. ఆయనో గొప్ప నేత, గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. అనంతరం ఆఫీసుకు వెళ్లి పాక్ ప్రధానితో ట్రంప్ భేటీ అయ్యారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Sep 26 , 2025 | 01:18 PM