Ponnam Prabhakar: ఆర్థోపెడిక్ సమస్యలపై ప్రజల్లో అవగాహన అవసరం
ABN, Publish Date - Feb 09 , 2025 | 09:04 AM
ఆర్థోపెడిక్ సమస్యలపై ప్రజల్లో అవగాహన అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలు తమ జీవితంలో రోజు వారీ వాకింగ్, రన్నింగ్ చేయడం అవసరమని అన్నారు.
హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో ఆర్థోపెడిక్ వాక్ థాన్ ఇవాళ(ఆదివారం) జరిగింది. జెండా ఊపి వాక్ థాన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆర్థోపెడిక్ వాక్ థాన్‌లో వందలాది మంది వాకర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆర్థోపెడిక్‌పై అవగాహన కల్పిస్తూ ఇలాంటి వాక్ థాన్‌లు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. మనిషి శరీరంలో ఎముకలు కీలకం.. ఎముకలు దృఢంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
ఆర్థోపెడిక్ సమస్యలపై ప్రజల్లో అవగాహన అవసరమని చెప్పారు. ప్రజలు తమ జీవితంలో రోజువారీగా వాకింగ్, రన్నింగ్ చేయడం అవసరమని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి అవగాహన వాక్ థాన్స్ నిర్వహించాలి, అందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. వైద్య పరంగా వస్తున్న మార్పుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
MLC Kavitha: కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు
Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ
Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News
Updated at - Feb 09 , 2025 | 10:46 AM