బండికి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

ABN, Publish Date - Feb 19 , 2025 | 04:42 PM

Komatireddy: కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు అన్ని పండుగలు సమానమే అని స్పష్టం చేశారు. హిందు, ముస్లిం, క్రిస్టియన్లను అందరిని కలుపుకుపోయే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.

సూర్యాపేట, ఫిబ్రవరి 19: తెలంగాణలో (Telangana) రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరికీ మినాహాయింపు ఇవ్వడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) మండిపడ్డారు. అయ్యప్ప, హనుమాన్, భవానీ భక్తులకు ఎందుకు ఆ వెసులుబాటు ఇవ్వడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి (Minister Komatireddy Venkatreddy) కౌంటర్ ఇచ్చారు. ‘‘మాది సెక్యూలర్ ప్రభుత్వం.. మాకు అన్ని పండుగలు సమానమే. హిందు, ముస్లిం, క్రిస్టియన్లను అందరిని కలుపుకుపోయే పార్టీ మాది. ఓట్ల కోసం దేశాన్ని విడగొట్టేది బీజేపీ. మా గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ఐదారు నెలలు కాదు 20 ఏళ్ళు కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. దూరాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతరకు సెలవిచ్చాం.. అలానే రంజాన్‌కు, బక్రీద్‌కు ఇస్తాం. బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఉన్న బీసీ పార్టీ అధ్యక్షుడిని ఎందుకు పీకేశారో చెప్పాలి. కేసీఆర్ తాత దిగివచ్చినా, బీజేపీ వచ్చినా ముందు భవిష్యత్ అంతా కాంగ్రెస్ పాలనే ఉంటుంది’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

జగన్ గుంటూరు పర్యటనపై సందిగ్థత...

ఛాంపియన్స్ మహా సమరం

Read Latest Telangana News And Telugu News

Updated at - Feb 19 , 2025 | 04:42 PM