Minister Atchannaidu: అసెంబ్లీ సాక్షిగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన అచ్చెన్న

ABN, Publish Date - Mar 12 , 2025 | 12:06 PM

ఆయిల్ పామ్ పెంచడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయిల్ పామ్‌ పంటకు ప్రధానంగా స్పింక్లర్లు, డ్రిప్ కావాలని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో స్పింక్లర్లు, డ్రిప్ ఎందుకు ఇవ్వలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

అమరావతి: ఆయిల్ పామ్ పెంచడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయిల్ పామ్‌ పంటకు ప్రధానంగా స్పింక్లర్లు, డ్రిప్ కావాలని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో స్పింక్లర్లు, డ్రిప్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయిల్ పామ్ పంటను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.


ఆయిల్ పామ్ పంట వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ఆ తర్వాత ఏపీ అంతా విస్తరించిందని తెలిపారు. ఈ మధ్య కొంతమంది అధికారులతో ఆయిల్ పామ్ పంట కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయించినట్లు తెలిపారు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ పంట పండించడానికి అనుకూలమని రిపోర్టు వచ్చిందని తెలిపారు. అధికారులు తెలిపిన నివేదిక ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఆయిల్ పామ్ పంట విస్తరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ పంటకు కేంద్ర ప్రభుత్వం ఓ స్కీమ్‌ను ప్రవేశ పెట్టిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 12 , 2025 | 12:14 PM