Shreyas Iyer IN ICU: ఐసీయూలో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:57 PM
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఆస్పత్రి ఐసీయూలో చేర్చారు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టే క్రమంలో కింద పడిపోయాడు. ఈ క్రమంలో అయ్యర్ పక్కటెములకు గాయమైంది.
క్రీడా వార్తలు: టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer IN ICU) సిడ్నీలోని ఆస్పత్రి ఐసీయూలో చేర్చారు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టే క్రమంలో కింద పడిపోయాడు. ఈ క్రమంలో అయ్యర్ పక్కటెములకు గాయమైంది. తొలుత డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రేయస్‌ను బీసీసీఐ(BCCI) సిబ్బంది వెంటనే సిడ్నీలో ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో వెంటనే ఐసీయూలో చేర్చి.. అయ్యర్‌కు చికిత్స అందిస్తున్నారు. కనీసం ఏడు రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే అతడు ఉండనున్నాడు.
ఇవి కూడా చదవండి:
2027 వరల్డ్ కప్.. రో-కో జోడీ ఫిక్స్: గావస్కర్
సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన రహానే!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి