Addanki Dayakar on BRS: బావా, బామ్మర్దుల నస భరించలేకున్నాం: అద్దంకి దయాకర్
ABN , Publish Date - Oct 27 , 2025 | 01:25 PM
బావ, బామ్మర్దుల నస భరించాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు పట్టిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్న పదేళ్లు బందిపోట్ల లాగా దోచుకున్నారని ఆయన
హైదరాబాద్, అక్టోబర్ 27: బావ, బామ్మర్దుల నస భరించాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు పట్టిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్న పదేళ్లు బందిపోట్ల లాగా దోచుకున్నారని ఆయన విమర్శించారు. 'బీఆర్ఎస్ నాయకులు ఇంత దిగజారి మాట్లాడతారా? బీఆర్ఎస్ మంత్రులకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండే. బీఆర్ఎస్ మంత్రుల్లో వెన్నెముక ఎవరికీ లేకుండే. ముఖ్యమంత్రిపై ఎక్కువ మాట్లాడే దరిద్రులను హెచ్చరిస్తున్నా. ఆటో కార్మికులు చనిపోయిన రోజు బీఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారు? మంత్రి వర్గాన్ని కించపరిచిన వారిపై కార్యాచరణ ప్రకటిస్తాం.' అంటూ అద్దంకి తిట్లదండకం అందుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో పారిపోయిన హరీశ్.. ఇప్పుడు అడ్లూరిని చూసి పారిపోయారని అద్దంకి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు అమ్మపాలు తాగి రొమ్ము గుద్దే రకం అంటూ ఆరోపించారు. సొంత మనిషి కవిత.. తనకి అన్యాయం జరిగిందని చెప్పినా పట్టించుకోవడం లేదని అద్దంకి అన్నారు. అప్పడు బీఆర్ఎస్ ను ప్రజలు గెలిపించడం.. తెలంగాణను దోచుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి లైసెన్స్ ఇచ్చినట్టు అయింది అని అద్దంకి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఇక, క్రియాశీల రాజకీయాలకు వస్తాడో లేదో తెలియదంటూ కూడా కామెంట్ చేశారు అద్దంకి.
ఇవీ చదవండి:
నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..
హైదరాబాద్ యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారీ హబ్
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి