Fake Currency: మంగళగిరిలో నకిలీ నోట్ల కలకలం

ABN, Publish Date - Jan 31 , 2025 | 09:36 PM

గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నకిలీ నోట్ల విషయం కలకలం రేపుతోంది. ఒరిజనల్ నోట్లకు రెట్టింపు నకిలీ నోట్లను ఇస్తామని ఆశ చూపించి ఓ దొంగల ముఠా సభ్యులు ఉడాయించారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో నకిలీ నోట్ల విషయం కలకలం రేపుతోంది. ఒరిజనల్ నోట్లకు రెట్టింపు నకిలీ నోట్లను ఇస్తామని ఆశ చూపించి ఓ దొంగల ముఠా సభ్యులు ఉడాయించారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మోససోయిన చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు బాధితులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుంటూరులోని జోసిల్ కంపెనీలో వీరు పనిచేస్తున్నారు. వీరు చిత్తూరు జిల్లాకు చెందినవారు.


వీరికి నకిలీ నోట్ల వ్యాపారంలో దొంగల ముఠా సభ్యులు ఆశ చూపించారు. వీరిని నకిలీ నోట్ల వ్యాపారం చేయించేలా నమ్మించారు. రూ. 15 లక్షల ఒరిజినల్ నోట్లను ఇస్తే రూ. 30 లక్షల నకిలీ నోట్లను ఇస్తామని ఆ ముఠా సభ్యులు బురిడీ కొట్టించారు. వీరి ప్లాన్‌లో భాగంగా రూ. 15 లక్షల ఒరిజినల్ నోట్లను దొంగల ముఠా సభ్యులు తీసుకున్నారు. మధ్యలో తెల్లనోట్ల కట్ట పెట్టి వాటిపైన నకిలీ నోట్లను ఉంచారు. అయితే బాధితులు వాటిని లెక్కించుకునే సమయం కూడా ఇవ్వకుండా కాజా టోల్‌గేటు నుంచి పారిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నకిలీ నోట్ల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి వారి ఉచ్చులో పడి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Jan 31 , 2025 | 10:08 PM