సాగరతీరాన నేవీడే వేడుకల్లో సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jan 04 , 2025 | 07:46 PM

CM Chandrababu: విశాఖ బీచ్‌లో నేవీ డే వేడుకలు ఇవాళ(శనివారం) జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు జ్ఞాపికను పారా గ్లైడర్ అందజేశారు.

విశాఖపట్నం: విశాఖ బీచ్‌లో నేవీ డే వేడుకలు ఇవాళ(శనివారం) ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు పాల్గొన్నారు. ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో జరిగే నేవీ డే వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు. భార్య భువనేశ్వరి. మనవడు దేవాన్ష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు జ్ఞాపికను అందజేశారు. నౌవికాదళం విన్యాసాలను సీఎం చంద్రబాబు తిలకించారు. డోర్నియర్ విమాన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. లేజర్ షో, డ్రోన్‌ షో, నేవీ బ్యాండ్ సంగీత ప్రదర్శన అలరించింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. విశాఖ అంటేనే ప్రశాంతతకు మారుపేరని చెప్పారు. పాకిస్థాన్‌తో యుద్ధంలో విశాఖ నేవీది కీలక పాత్ర అని గుర్తుచేశారు. విశాఖపట్నం కేంద్రంగా తూర్పు నౌవికాదళానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. హుద్‌హుద్ సమయంలో నేవీ సాయం మరవలేనిదని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.


విశాఖ ఏపీకి ఆర్థిక రాజధాని అని ఉధ్ఘాటించారు. నాలెడ్జ్ హబ్‌, టూరిజం హబ్‌గా విశాఖను తయారు చేస్తామని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. విశాఖలో గూగుల్, టీసీఎస్ పెట్టుబడులు పెట్టబోతున్నాయని ప్రకటించారు. త్వరలోనే రైల్వేజోన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. విశాఖకు త్వరలోనే మెట్రో రైలు రాబోతోందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నావికాదళం విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. నావికాదళానికి అభినందనలు.. వారి ధైర్యానికి హ్యాట్సాఫ్‌ అని చెప్పారు. విశాఖకు ఎన్నోసార్లు వచ్చినా.. ఈ పర్యటన సంతోషకరంగా ఉందని అన్నారు. ఎలాంటి ఆపద వచ్చినా సహాయక చర్యల్లో నేవీ ముందుంటుందని అన్నారు. తుఫాన్ సమయంలో మత్స్యకారులను నేవీ కాపాడుతోందని చెప్పారు. దేశరక్షణతో పాటు ఆర్థికాభివృద్ధి కూడా అంతే ముఖ్యమని అన్నారు. తూర్పు నావికాదళం విశాఖలో ఉండటం మన అదృష్టమని చెప్పారు. విశాఖ నాలెడ్జ్‌ హబ్‌గా, టూరిజం హబ్‌గా వర్ధిల్లనుందని అన్నారు. ఓషన్‌ ఎకానమీలో ఇంకా మనం ప్రవేశించలేదన్నారు. ఓషన్‌ ఎకానమీ ఓ పెద్ద ఆర్థిక అవకాశమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayawada: నేటి నుంచే ఆ పథకం స్టార్ట్.. ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్..

Atchannaidu: వ్యవసాయ రంగంలో కొత్త టెక్నాలజీ

AP Ministers: తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులపై మంత్రులు ఏమన్నారంటే..

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated at - Jan 04 , 2025 | 07:52 PM