Aarogyasri Services: ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. తిప్పలు పడుతున్న రోగులు
ABN, Publish Date - Jan 20 , 2025 | 08:15 PM
తెలంగాణలో రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. పదిరోజులుగా రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రులన్నీ డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా అన్నిరకాల సేవలన్నింటిని నిలిపివేశాయి.
హైదరాబాద్: తెలంగాణలో రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. పదిరోజులుగా రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రులన్నీ డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా అన్నిరకాల సేవలన్నింటిని నిలిపివేశాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని ఆరోగ్య శ్రీ కౌంటర్లను యజామాన్యాలు మూసివేశాయి. దీంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య శ్రీ కార్డు పట్టుకుని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే చికిత్స లభిస్తుందన్నా ధీమా రోగుల్లో కనిపించడం లేదు.
గతంలో ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు పొందిన రోగులు ఇప్పుడు ఈ పథకం పరిధి రూ. 10 లక్షలకు పెరిగినా ఉపయోగం లేకుండా పోయిందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత వారం రోజులుగా అత్యవసరమైతే తప్పా ఇతర వైద్య సేవల కోసం రోగులు ఆస్పత్రులకు వెళ్లలేదు. దాంతో అటు ప్రభుత్వ ఇటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ భారీగా పడిపోయాయి. మళ్లీ ఇప్పుడు రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి..
జమ్మూలో వింత వ్యాధి.. వరుస మరణాలు..
వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jan 20 , 2025 | 09:53 PM