Home » AarogyaSri
రాష్ట్రంలో ఆదివారం (31వ తేదీ) అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సేవలను నిలిపివేసేందుకు నెట్‌వర్క్ ఆస్పత్రులు సిద్ధమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, జర్నలిస్టు, ఉద్యోగుల ఆరోగ్య పథకం వైద్య సేవలను ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి నిలిపి వేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(టీఏఎన్‌హెచ్‌ఏ) ప్రకటించింది
పైసలిస్తేనే ఆరోగ్యశ్రీ ఎం-ప్యానెల్‌మెంట్‌కు అనుమతిస్తున్నట్లు ఏ ఒక్క ప్రైవేటు ఆస్పత్రి నుంచి తమకు ఫిర్యాదు రాలేదని ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ ఉదయ్‌కుమార్ తెలిపారు.
ఆరోగ్యశ్రీ మాటున ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న మోసాలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తీవ్రంగా స్పందించింది. అనధికారికంగా ఆరోగ్యశ్రీ పేరిట చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది.
అనారోగ్యం బారిన పడి.. తగిన చికిత్స చేయించుకునే స్థోమత లేని పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు తప్పుదోవ పట్టిస్తున్నాయి.
YS Sharmila Criticizes AP Govt: ఏపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు.
చిన్నారులకు వినికిడి సమస్య నుంచి ఉపశమనం కలిగించే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి వయసు పరిమితిని ప్రభుత్వం పెంచింది. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కింద ఇంతకాలం పిల్లలకు మూడేళ్ల వయసు వరకే ఈ శస్త్రచికిత్స చేయించుకునే వెసులుబాటు ఉండగా, దానిని ఐదేళ్ల వయసు వరకు ప్రభుత్వం పెంచింది.
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త(కోఆర్డినేటర్)ల నియామక ప్రక్రియ అంతా నిబంధనల మేరకే చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో టీ శివశంకర్ వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయం అక్రమాలకు కేంద్రంగా మారింది. కార్యాలయంలో ఇద్దరు ముగ్గురు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. పదిరోజులుగా రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రులన్నీ డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా అన్నిరకాల సేవలన్నింటిని నిలిపివేశాయి.