Share News

నిబంధనల మేరకే ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ల నియామకం

ABN , Publish Date - Feb 13 , 2025 | 03:38 AM

ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త(కోఆర్డినేటర్‌)ల నియామక ప్రక్రియ అంతా నిబంధనల మేరకే చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో టీ శివశంకర్‌ వెల్లడించారు.

నిబంధనల మేరకే ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ల నియామకం

  • వారంతా 28-44 ఏళ్ల మఽధ్య వయస్కులే..

  • ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేయట్లేదు

  • వివరణ ఇచ్చిన ఆ రోగ్య శ్రీ ట్రస్టు సీఇవో

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త(కోఆర్డినేటర్‌)ల నియామక ప్రక్రియ అంతా నిబంధనల మేరకే చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో టీ శివశంకర్‌ వెల్లడించారు. ‘ఆరోగ్యశ్రీలో అక్రమ నియామకాల’ పేరిట బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వచ్చిన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్తల పోస్టులు పది ఉన్నాయని తెలిపారు. వాటిలో 8 ఖాళీగా ఉండగా 6 పోస్టులను భర్తీ చేశామని వెల్లడించారు. నిజామాబాద్‌, మెదక్‌ జిల్లా పోస్టులు ఇంకా భర్తీ కాలేదని తెలిపారు. నియామకం చేపట్టిన ఆరు చోట్ల ఎంపికైన అభ్యర్ధుల వయసు 28- 44 ఏళ్ల మధ్య ఉందని పేర్కొన్నారు. తాజాగా ఎంపికైన అభ్యర్ధులెవ్వరూ ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేయడం లేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ప్రైవేటులో పనిచేస్తున్నట్లు తేలితే తొలగిస్తామని తెలిపారు. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ప్రైవేటు వ్యక్తులెవ్వరూ పనిచేయడం లేదని, ప్రస్తుతం పనిజేస్తున్న డాక్టర్‌ బాలకృష్ణ ప్రభుత్వ వైద్యుడని వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ములుగు మన్నెంలో జాతరల సందడి

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

మేడారం మినీజాతర.. మొక్కులు చెల్లించకోనున్న భక్తులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 13 , 2025 | 03:38 AM