ఆరోగ్యశ్రీలో అక్రమ నియామకాలు!
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:01 AM
ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయం అక్రమాలకు కేంద్రంగా మారింది. కార్యాలయంలో ఇద్దరు ముగ్గురు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కోఆర్డినేటర్ల నియామకం.. తాజాగా 5 జిల్లాల్లో పోస్టుల భర్తీ
ఒక్కో పోస్టుకు రూ.లక్షల్లో వసూలు
70 ఏళ్ల రిటైర్డ్ వైద్యుడికీ పోస్టు
ఈ దందా వెనుక ఆరోగ్యశ్రీ ట్రస్టులో ఇద్దరు-ముగ్గురు అధికారుల హస్తం
హైదరాబాద్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయం అక్రమాలకు కేంద్రంగా మారింది. కార్యాలయంలో ఇద్దరు ముగ్గురు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఐదు జిల్లాలకు ఆరోగ్యశ్రీ సమన్వయకర్త(కోఆర్డినేటర్)లను నిబంధనలకు విరుద్ధంగా నియమించిన వైనం బయటపడింది. ఈ నియామకాల వెనక లక్షల రూపాయలు చేతులు మారాయని తెలిసింది. వాటిలో నాలుగు జిల్లాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కాబట్టి ఎటువంటి నియామకాలు చేపట్టరాదు. కానీ, ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలోని కొందరు అధికారులు ఆ నియామకాలను గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేశారు. వాస్తవానికి ఆరోగ్య సమన్వయకర్తల నియామకం చేపడితే ముందుగా నోటిఫికేషన్ ఇవ్వాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులతో ఆ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు వైద్యులు మాత్రమే అర్హులని, వారు ఏ ఆస్పత్రుల్లోనూ ప్రాకీస్టు చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయి. కానీ రెండు జిల్లాల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యులుగా పనిచేస్తున్న వారిని ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్తలుగా నియమించారు.
నాలుగైదు రోజుల క్రితం వారికి నియామక లేఖలు ఇచ్చారు. వైద్య ఆ రోగ్యశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నియామకాలు చేపట్టారని సమాచారం. అలాగే, దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాకు 70 ఏళ్లు పైబడిన ఓ వైద్యుడికి ఆరోగ్యశ్రీ జిల్లా సమయన్వకర్త పోస్టును కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆ వయసులో ఆయనకు ఎందుకు కోఆర్డినేటర్ పోస్టు అప్పగిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నియామకాల వెనక లక్షల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎపిడిమాలజిస్టు అయిన ఆ రిటైర్డ్ డాక్టర్‌ను తీసుకునే విషయంలో ఈ మొత్తం భారీగా ఉన్న ట్లు కార్యాలయ వర్గా లు చెబుతున్నాయి. ఈ సొమ్మంతా ట్రస్టు కా ర్యాలయంలోని ఇద్దరు అధికారుల జేబుల్లోకి వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రధాన కా ర్యాలయంలోనూ నిబంధనలకు విరుద్ధం గా ఓ కీలక పోస్టును భర్తీ చేసినట్లు సమాచారం. ఉద్యోగు ల ఆరోగ్య పఽథకంలో ఓ పోస్టును ట్రస్టుకు సంబంధం లేని, ఓ ప్రైవేటు వ్యక్తిని తీసుకొచ్చి కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ నియామకాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాల ని ట్రస్టు వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.
అంత డిమాండ్ ఎందుకంటే..
ఆరోగ్యశ్రీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా ప్రతి జిల్లాకు సమన్వయకర్తలను నియమిస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు వివిధ శస్త్రచికిత్సలకు నిర్దేశించిన చార్జీలకంటే ఎక్కువ వసూలు చేస్తుంటాయి. ఈ విషయాన్ని ముందే పేషెంట్లకు చెప్పి.. అంగీకరిస్తేనే ఆపరేషన్ చేస్తారు. అధికంగా డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. బాధితులు సంబంధిత జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్తలకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులపై చర్యలు తీసుకునే అధికారం సమన్వయకర్తకు ఉంటుంది. జిల్లాలో ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులపై పర్యవేక్షణ బాధ్యత కూడా సమన్వయకర్తే చూస్తారు. దీంతో వారితో సమస్య ఎందుకని కొన్నిచోట్ల ప్రైవేటు ఆస్పత్రులన్నీ కలిసి ప్రతి నెలా లక్షల్లో ముట్టచెబుతుంటాయి. ఒక్కో ప్రైవే టు ఆస్పత్రి 10వేల నుంచి 30 వేల వరకు ఇస్తుంటాయని ఓ ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News