Fake Snack Units: పాడైన పదార్థాలతో పిండి వంటలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:31 PM
జహీరాబాద్ లో కల్తీ కార తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎలాంటి భద్రతా నియమాలు పాటించకుండానే పాడైన ఆహార పదార్థాలు, నాసిరక ముడిసరకుతో పిండి వంటలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
జహీరాబాద్, నవంబర్ 5: నేటికాలంలో ఎక్కడ చూసినా కల్తీ వస్తువులే కనిపిస్తున్నాయి. దీంతో బయట ఫుడ్ తిన్నాలంటేనే జనాలు భయపడుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొందరు కేటుగాళ్లు ఈ నకిలీ ఫుడ్ ఐటెమ్స్ ను తయారు చేస్తూనే ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ లోని చంద్రనగర్, శేరిలింగంపల్లి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేసి.. ఆహార భద్రతలను పాటించని హోటల్స్ కు నోటీసులు జారీ చేశారు. తాజాగా జహీరాబాద్ పట్టణంలో కల్తీ కార తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.
ఎలాంటి భద్రతా నియమాలు పాటించకుండానే, పాడైన ఆహార పదార్థాలు, నాసిరక ముడిసరుకుతో పిండి వంటలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టణంలోని ప్రగతి నగర్ కాలనీ 'పరస్ కార తయారీ కేంద్రం', అలాగే హమాలి కాలనీ 'అభినయ శ్రీ స్పెషల్ కార తయారీ కేంద్రం' పై పోలీసులు దాడులు చేశారు.
అభినయ, పరాస్ నాథ్, పేరుమల్ అనే ఫుడ్ తయారీ కేంద్రాలపై అధికారులు కేసు నమోదు చేశారు. నాసిరకం ముడి సరుకుతో తయారు చేసిన పదార్థాలను జహీరాబాద్, పరిసర ప్రాంతాల్లో విక్రయించడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని పోలీసులు తెలిపారు. కార తయారీకి వాడిన పదార్థాలు, యంత్రాలు, ముడిసరకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read:
జూబ్లీహిల్స్ ప్రజలు దొంగ సర్వేలను నమ్మరు
ధాన్యం కొనుగోలు డబ్బులు.. 24 గంటల్లోనే
For More Latest News