Hyderabad Chutney Incident: హైదరాబాద్‌లో దారుణం.. చట్నీ పడిందని.. చంపేశారు..
ABN , Publish Date - Nov 05 , 2025 | 02:21 PM
సభ్యసమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. కేవలం బట్టలపై చట్నీ పడిందనే చిన్న కారణంతో ఒక వ్యక్తిని నలుగురు అతి కిరాతకంగా హత్య చేశారు.
హైదరాబాద్: సభ్యసమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. చిన్నచిన్న విషయాలకే సహనం కోల్పోయి ఇతరులపై దాడులకు తెగబడుతున్నారు. కేవలం చట్నీ విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. బట్టలపై చట్నీ పడిందనే చిన్న కారణంతో ఒక వ్యక్తిని నలుగురు యువకులు అతి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ ఉప్పల్ కల్యాణపురి నివాసి మురళీ కృష్ణ(45) సోమవారం నాడు పని మీద ఎల్బీనగర్ వెళ్లాడు. అనంతరం రాత్రి ఇంటికి వెళ్లేందుకు కారులో వెళ్లున్న వారిని లిఫ్ట్ అడిగాడు. ఆ కారులో నలుగురు యువకులు ఉన్నారు. అయితే, మార్గం మధ్యలో వారికి ఆకలి వేయడంతో ఉప్పల్‌లోని ఓ టిఫిన్ సెంటర్ దగ్గర వారంతా టిఫిన్ చేయడానికి ఆగారు. అయితే, అక్కడ అనుకోకుండా మురళీ కృష్ణ ప్లేట్‌లోని చట్నీ ఒక యువకుడిపై పడింది. దీంతో ఆ యువకులు మురళీ కృష్ణతో గొడవకు దిగారు. బలవంతంగా అతడిని కారులోకి ఎక్కించుకుని సుమారు రెండు గంటలపాటు కారులోనే తిప్పుతూ చిత్ర హింసలకు గురి చేశారు.
అంతేకాకుండా, నాచారం సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో అతడిని విచక్షణారహితంగా పొడిచారు. నిందితుల నుంచి తప్పించుకునేందుకు మురళీ కృష్ణ ప్రయత్నించి చివరికి తన ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనపై కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read:
జూబ్లీహిల్స్ ప్రజలు దొంగ సర్వేలను నమ్మరు
ధాన్యం కొనుగోలు డబ్బులు.. 24 గంటల్లోనే
For More Latest News