Naxalites Fierce Encounter: ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల హతం..
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:14 PM
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. భద్రతా దళాలు సంఘటనా స్థలంనుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దు బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం, మారిమల్ల అడవుల్లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతంలోని మావోయిస్టులను భద్రతా దళాలు చుట్టుముట్టినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. భద్రతా దళాలు సంఘటనా స్థలంనుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా అదే ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే, మావోయిస్టుల మృతిపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఇవి కూడా చదవండి
సినిమా హాళ్లపై సుప్రీంకోర్టు సీరియస్.. అలా అయితే మూతపడతాయ్..
పిల్లలతో ఇలాంటి జోక్‌లు వద్దు.. ఆ పాప షాకింగ్ రియాక్షన్ చూడండి..