Share News

Girl photo shock: పిల్లలతో ఇలాంటి జోక్‌లు వద్దు.. ఆ పాప షాకింగ్ రియాక్షన్ చూడండి..

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:25 PM

చిన్న పిల్లల రియాక్షన్‌లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి. పిల్లలు అమాయకత్వం, వారి అల్లరి, ఫన్నీ రియాక్షన్లు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి.

Girl photo shock: పిల్లలతో ఇలాంటి జోక్‌లు వద్దు.. ఆ పాప షాకింగ్ రియాక్షన్ చూడండి..
terrifying photo

చిన్న పిల్లల రియాక్షన్‌లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి. పిల్లలు అమాయకత్వం, వారి అల్లరి, ఫన్నీ రియాక్షన్లు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా ఓ చిన్న అమ్మాయికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ చిన్న అమ్మాయి ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ కొందరికి నవ్వు తెప్పిస్తుంటే మరికొందరికి ఆందోళన కలిగిస్తోంది (Funny Viral Video).


@0nlyk1tt3n అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ చిన్న పాప అమాయకంగా ఫొటోకు ఫోజిస్తోంది. అందమైన చిరునవ్వు, మెరిసే కళ్లతో కెమెరా ముందు నిల్చుంది. అయితే ఫొటో తీసే వ్యక్తి కెమెరా సెట్టింగ్స్ మార్చి ఆ పాప ఫొటో తీశాడు. ఆ పాప మొహం ఉన్న ప్లేస్‌లో భయంకరమైన ఎమోజీ వచ్చేలా చేశాడు. ఫోటో తీసిన తర్వాత మొబైల్ స్క్రీన్ చూసిన బాలిక షాకైంది. ఫొటోలో తన మొహం చూసి భయపడి వెనక్కి వెళ్లిపోయింది (scary viral photo).


ఆ పాప షాకింగ్ రియాక్షన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (shocking image). 1.3 కోట్ల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. లక్షల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. చిన్న పిల్లలతో అలాంటి జోక్‌లు వద్దని ఒకరు హితవు పలికారు. ఆ పాప షాకింగ్ రియాక్షన్ చాలా అందంగా ఉందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఇదెక్కడి పిచ్చి సామీ.. రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా..

మీవి డేగ కళ్లు అయితే.. ఈ రాళ్ల మధ్యనున్న కప్పను 5 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 05 , 2025 | 04:25 PM