Share News

Man on frying pan: ఇదెక్కడి పిచ్చి సామీ.. రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా..

ABN , Publish Date - Nov 05 , 2025 | 02:58 PM

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు.

Man on frying pan: ఇదెక్కడి పిచ్చి సామీ.. రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా..
man on frying pan

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (viral stunt).


patil_auto_wale అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి 'ఏక్ దీవానే కి దీవానియాత్' సినిమా టైటిల్ సాంగ్ ఆధారంగా ఒక రీల్‌ను రూపొందించాడు. అయితే అందుకోసం అతడు విచిత్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. స్టవ్ వెలిగించి దాని మీద పెనం పెట్టాడు. ఆ కాలుతున్న పెనం మీద అతడు కూర్చుని ఆ పాటకు అనుగుణంగా హావభావాలు ప్రదర్శించాడు. ఆ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది ( social media madness).


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు (shocking viral video). 31 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. 'బ్రదర్.. మీరు ఎవరూ కాపీ చేయలేని కంటెంట్‌ను సృష్టించారు' అని ఒకరు కామెంట్ చేశారు. ఇది ఎంత అర్థం లేనిది అని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రదర్.. మీకు కాలడం లేదా అని ఒకరు ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

కెనడాలో విచిత్రమైన కప్ప.. నోటిలో కళ్లు.. కారణమేంటంటే..

మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని రెండు తేడాలను 27 సెకెన్లలో కనిపెట్టండి



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 05 , 2025 | 02:58 PM