Strangest frog: కెనడాలో విచిత్రమైన కప్ప.. నోటిలో కళ్లు.. కారణమేంటంటే..
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:50 PM
ప్రకృతి చాలా నిగూఢమైనది. ఎన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ ఇంకా అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉంటాయి. ఎంత పరిశోధించినా మానవ మేధస్సుకు అందని ఎన్నో మార్మికమైన విషయాలు ఉంటాయి. అవి బయటపడినప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రకృతి చాలా నిగూఢమైనది. ఎన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ ఇంకా అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉంటాయి. ఎంత పరిశోధించినా మానవ మేధస్సుకు అందని ఎన్నో మార్మికమైన విషయాలు ఉంటాయి. అవి బయటపడినప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా కెనడాలో ఓ అరుదైన కప్ప కనిపించింది. కెనడాలోని ఒంటారియోలోని బర్లింగ్టన్‌కు చెందిన హైస్కూల్ విద్యార్థిని డీడ్రే ఓ విచిత్రమైన కప్పను కనిపెట్టి ప్రపంచానికి వెల్లడించింది (weird frog).
ఆ బాలిక తన ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటుండగా ఆమెకు ఓ విచిత్రమైన కప్ప కనిపించింది. ఆ కప్ప కళ్లు మూసుకుని ఉంది. అయితే అది నోరు తెరవగానే లోపల కళ్లు కనిపించాయి. దాని నోటి లోపల రెండు ప్రకాశవంతమైన కళ్ళు మెరుస్తున్నాయి. ఆ కప్ప మరొక జీవిని మింగి ఉంటుందని డీడ్రే భావించింది. కానీ దగ్గరకు వెళ్లి పరిశీలించినప్పుడు, ఆ కళ్ళు దానివే అని ఆమె గ్రహించింది. ఈ ప్రత్యేకమైన కప్పకు సంబంధించిన ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్థానిక దినపత్రిక ఫొటోగ్రాఫర్‌కు పంపించింది (frog with eyes in mouth).
లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో చీకటిలో నివసించే 'గొల్లమ్' పేరును ఈ విచిత్రమైన కప్పకు పెట్టింది (strange creatures). ఈ కప్ప ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఇది జన్యు పరివర్తన. అంటే పిండం అభివృద్ధి చెందే సమయంలో జరిగిన లోపం కారణంగానే కప్పకు ఇలా నోటి లోపల కళ్లు వచ్చినట్టు భావిస్తున్నారు. ఇది మాక్రో-మ్యుటేషన్ కేసు అని, ఇది చాలా అరుదు అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రసాయన కాలుష్యం లేదా పర్యావరణ ప్రభావం వల్ల ఇలాంటి పరివర్తనలు జరుగుతాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
స్లీపర్ బస్ ఎక్కుతున్నారా? ముందు ఈ విషయాల గురించి తెలుసుకోండి..
మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో ఏనుగును 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..