Share News

Road Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోరం.. లారీ ఢీకొని..

ABN , Publish Date - Oct 31 , 2025 | 07:25 AM

హనుమకొండ జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..

Road Accident: పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోరం.. లారీ ఢీకొని..

హనుమకొండ జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురం క్రాస్‌ రోడ్డు వద్ద హైవే రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 12కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..


హనుమకొండ జిల్లాలో విషాధ ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సూదన్‌పల్లికి చెందిన యువతికి.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. వరుడి ఇంటి వద్ద వివాహం ఘనంగా జరిగింది. కార్యక్రమం అనంతరం వధువు బంధువులు.. తిరిగి సొంతూరుకు బొలేరో వాహనంలో బయలుదేరారు. అయితే గోపాలపురం క్రాస్‌ వద్ద వాహనాన్ని ఆపారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ లారీ బొలేరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలేరో వాహనంలో ఉన్న స్వప్న(16), కళమ్మ(55), శ్రీనాథ్‌(5).. అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం MGM ఆస్పత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమ్మపాల అమృతాన్ని పంచి..

తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2025 | 07:26 AM