Beer Price: బీర్ల ధరలు పెరిగాయ్..
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:12 AM
రాష్ట్రంలో బీర్ల ధరల పెంపు అమలులోకి వచ్చింది. గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)పై 15 శాతం పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇవ్వగా మంగళవారం నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.

సగటును ఒక్కో బీరు ధర రూ.35 పెంపు
ప్రభుత్వానికి ప్రతి నెలా 150 కోట్ల అదనపు రాబడి
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీర్ల ధరల పెంపు అమలులోకి వచ్చింది. గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)పై 15 శాతం పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇవ్వగా మంగళవారం నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ధరలను 15 శాతం పెంచిన తర్వాత వచ్చిన మొత్తాన్ని దగ్గరి రూపాయికి సవరించుకోవచ్చునని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ధరలను దగ్గరి దశాంశానికి సవరించారు. దీంతో ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో బీరు ధర సగటున రూ.35 మేర పెరిగింది. ఉదాహరణకు సోమవారం దాకా రూ.150 ఉన్న కింగిఫిషర్ లైట్ బీరు సీసా ధర 15 శాతం పెంపుతో రూ.172.50 అవుతుంది. కానీ, దగ్గరి దశాంశ రూపాయికి సవరించడంతో ఆ సీసా ధర రూ.180కి చేరింది.
మిగిలిన బ్రాండ్ల బీర్ల ధరలు కూడా ఇలానే పెరిగాయి. కాగా, రాష్ట్రంలో ప్రతి నెలా 41లక్షల కేసులు (ఒక కేసులో 12సీసాలు) అంటే సుమారు 4.92కోట్ల బీర్లు అమ్ముడవుతాయి. అంటే ప్రతి నెలా దాదాపు 5 కోట్ల బీర్లు అమ్ముతారు. ఒక్కో బీరు ధర సగటున రూ.35 పెరిగిందంటే రూ.175 కోట్లు అదనంగా వస్తుంది. అయితే, ఈ పెంచిన ధరల్లో బీర్ల తయారీదారులకు ఒక్క కేసుకు పెరిగేది రూ.42 మాత్రమే. ఇప్పటివరకు కింగ్ ఫిషర్ లైట్ బీరు ఒక కేసుకు ప్రభుత్వం తయారీదారుకు రూ.290 చెల్లిస్తుండగా.. పెరిగిన రూ.42తో కలిపి ఇకపై రూ.332 చెల్లిస్తుంది. ఈ లెక్కన బీరు తయారీ దారులకు పెరిగిన ధర ఒక బీరుకు రూ.3.50 మాత్రమే. ఇది కాక దుకాణ యజమానులకు చెల్లించే కమీషన్ పోను ప్రభుత్వానికి ప్రతి నెలా సుమారు రూ.150 కోట్లు అదనపు ఆదాయంగా సమకూరనుందని అంచనా.
బీరు (650ఎంఎల్) పాత ధర ప్రస్తుత ధర
కేఎఫ్ లైట్ 150 180
కేఎఫ్ ప్రీమియం 160 190
హేవార్డ్స్ 160 190
కేఎఫ్ ఆల్ర్టా 210 250
బడ్వైజర్ లైట్ 210 250
కేఎఫ్ అల్ర్టా మ్యాక్స్ 220 260
బడ్వైజర్ మ్యాగ్నం 220 260
టూబర్గ్ స్ర్టాంగ్ 220 260
నాకౌట్ 160 190
రాయల్ చాలెంజ్ 150 180
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా: నారావారిపల్లెలో విషాదం
ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా..: హరీష్‌రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News