SLBC: టన్నెల్‌లో ఆ ఎనిమిది మంది.. సిచ్యుయేషన్ వెరీ డేంజర్..?
ABN , Publish Date - Feb 23 , 2025 | 08:55 PM
SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి పరిస్థితి ఆశాజనకంగా లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టన్నెల్‌లో దాదాపు 5 గంటల పాటు సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. అనంతరం నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంటలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

నాగర్ కర్నూలు, ఫిబ్రవరి 23: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. అయితే చివరి వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం దోమలపెంటలోని ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం దోమలపెంటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి మరో రెండు, మూడు గంటల సమయం పడుతుందన్నారు.
సమస్య అంతా 100 మిటర్లలోపే ఉందని వివరించారు. నీటితోపాటు బురద అధికంగా ఉందని పేర్కొన్నారు. గత రాత్రి సైతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందని చెప్పారు. 8 మంది కార్మికుల రక్షణ కోసమే తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. టన్నెల్‌లోనే దాదాపు ఐదు గంటలు పాటు జూపల్లి కృష్ణారావు గడిపారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ఆయనపై పరిస్థితిని వివరించారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గంలో విపత్తు సంభవించింది. టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతుండగా.. 14వ కిలోమీటరు వద్ద పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సొరంగం లోపల ఎనిమిది మంది చిక్కుకోగా.. పలువురు త్రుటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన శనివారం.. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ సొరంగంలో చోటుచేసుకుంది.
Also Read: ప్రారంభమైన జనసేన శాసన సభా పక్ష సమావేశం
ఈ ఘటనపై సమాచారం తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి.. ఉన్నతాధికారులకు అప్రమత్తం చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిని వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయ చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఒక్కసారిగా పైకప్పు కూలిపోవడంతో అక్కడ పనులు చేస్తున్న కార్మికులు, ఇంజినీర్లు, ఆపరేటర్లు అయోమయానికి గురయ్యారని సమాచారం.
Also Read: బ్రౌన్ రైస్ వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
మొదటి షిప్టులో శనివారం ఉదయం దాదాపు 40 మంది సొరంగంలోని పని ప్రదేశానికి చేరుకొనేందుకు పనులకు సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సొరంగ మార్గంలోని 14వ కిలోమీటరు వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో పనులు జరుగుతున్నాయి. అక్కడ కొన్నాళ్లుగా పైకప్పు నుంచి లీకేజీలున్నాయి. శనివారం నీటి లీకేజీలు కొనసాగుతుండగా మట్టి కూడా ఉబికి రావడంతో పైకప్పు కాంక్రీట్ సెగ్మెంట్స్ ఒక్కసారిగా కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. పని ప్రదేశం నుంచి వెనక్కి దాదాపు 10 సీసీ బ్లాకులు కూలిపోవడంతో 100 మీటర్ల మేర నీరు, మట్టి కూరుకుపోయింది.
Also Read: మూడో తరగతి విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాష్టీకం
టీబీఎంకు సమీపంలో పనులు చేస్తున్న జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్, రాబిన్‌సన్ కంపెనీకి చెందిన ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు అందులో చిక్కుకుపోయారని ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి. మిగతా 32 మంది వరకు కార్మికులు, టెక్నీషియన్లు బయటకు రాగలిగారు.
Also Read : రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఈ పనులు ప్రారంభించారు. ఆ పనులు ప్రారంభమైన కొద్ది రోజులకే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాద ఘటనపై సమాచారం తెలియగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్, కలెక్టర్ బాదావత్ సంతోష్‌లు వెంటనే అక్కడికి చేరుకుని ఇంజినీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
Also Read : ఉపాధ్యాయ సంఘాలతో ఎమ్మెల్సీ అభ్యర్థి భేటీ.. కీలక వ్యాఖ్యలు
ఇక నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తు్న్నారు. అనంతరం పరిస్థితులను సమీక్షించారు. అలాగే నీటిపారుదలశాఖ సీఈ అజయ్‌కుమార్ తమ సిబ్బందితో కలిసి సొరంగం వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి జాతీయ విపత్తుల నిర్వహణ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సొరంగం లోపలికి వెళ్లడానికి ఉన్న అవకాశాలపై చర్చలు చేపట్టాయి.
Also Read: అసెంబ్లీ సమావేశాలకు జగన్ రెడ్డి.. అధికార పక్షం సంచలన వ్యాఖ్యలు
మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ.. సీఎం రేవంత్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎంకు పీఎం భరోసా ఇచ్చారు. ఆ క్రమంలో వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను దోమలపెంటకు పంపారు. ఇక సికింద్రాబాద్ నుంచి ఆర్మీ ఇంజినీర్లను సిద్ధం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘ఎక్స్’ వేదికగా ఈ ప్రమాదంపై ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
For Telangana News And Telugu News