AP Assembly Budget Session: అసెంబ్లీకి జగన్ రెడ్డి.. అధికార పక్షం సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:01 PM
AP Assembly Budget Session: అధికార టీడీపీ సభ్యులు అందరూ ఈసారి నేరుగా సభకు వచ్చే అవకాశముందని సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ సారి వెంకటపాలెంలోని వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహనికి పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుతోపాటు ఆ పార్టీ ఎమ్మె్ల్యేలంతా నివాళులు అర్పించే కార్యక్రమంపై తీవ్ర సంగ్ధిద్దత నెలకొంది.

అమరావతి, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అంటే.. సోమవారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభమవుతోన్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఎమ్మెల్యే జగన్.. తన సభ్యులతో కలిసి సభకు వస్తోంది ప్రజా సమస్యలపై చర్చకు కాదు.. సభలో సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి అంటూ అధికార పక్షం ఎద్దేవా చేస్తోంది.
60 రోజులు వరుస పని దినాల్లో అసెంబ్లీకి హజరు కాకుంటే.. సభలో సభ్యత్వాన్ని రద్దు చేసే హక్కు ఉందంటూ నిబంధనలను అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు. ఆ క్రమంలో ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం వరుసగా 60 రోజులు సభకు రాకుంటే.. సభ్యత్వం రద్దు చేయొచ్చుంటూ నిబంధన చెబుతోందని వారు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు అధికార టీడీపీ సభ్యులు అందరూ ఈసారి నేరుగా సభకు వచ్చే అవకాశముందని సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ సారి వెంకటపాలెంలోని వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహనికి పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుతోపాటు ఆ పార్టీ ఎమ్మె్ల్యేలంతా నివాళులు అర్పించే కార్యక్రమంపై తీవ్ర సంగ్ధిద్దత నెలకొంది. అయితే సోమవారం ఉదయం 9.45 గంటలకు సీఎం చంద్రబాబు అసెంబ్లీకి చేరుకోనున్నారు.
Also Read : కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఉభయసభల నుద్దేశించి గవర్నర్‌కు గార్డ్ ఆఫ్ ఆనర్ అనంతరం సీఎం చంద్రబాబు ఆయనకు స్వయంగా స్వాగతం పలకనున్నారు. సీఎంతో పాటు శాసన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సైతం గవర్నర్‌కు అసెంబ్లీ వద్ద స్వాగతం పలక నున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సందేశం చదివి వినిపించనున్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీ వాయిదా పడనుంది.
Also Read : ఉపాధ్యాయ సంఘాలతో ఎమ్మెల్సీ అభ్యర్థి భేటీ.. కీలక వ్యాఖ్యలు
ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మార్చి 28వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు.. వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక అసలు అయితే రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 4వ తేదీన సభలో ప్రవేశపెట్టాలంటూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఫిబ్రవరి 28వ తేదీనే సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read : రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
అయితే అసెంబ్లీకి వస్తున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. అసెంబ్లీ సమావేశాలు అన్నింటికి హాజరువుతారా? లేకుంటే.. తొలి రోజు వచ్చి.. అటెండెన్స్ వేయించుకొని వెళ్లి పోతారా? అనేది సందేహమనే ఓ చర్చ సైతం సాగుతోంది. ఎందుకంటే.. ప్రతిపక్ష హోదా నాయకుడిగా తనకు హోదా కేటాయిస్తానే అసెంబ్లీకి హాజరవుతానంటూ గతంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ లేఖ రాశారు.
సభలో సంఖ్య బలం లేకుంటే.. అలా ఇవ్వడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. దీంతో తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ ఏపీ హైకోర్టును మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
మరోవైపు.. రేపటి నుంచి 47వ శాసన మండలి, 16వ శాసనసభ మూడవ సమావేశ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తాతో సమీక్షా నిర్వహించారు. గవర్నర్ ప్రసంగం జరిగే రోజు ఉదయం 9.30 గంటలకు సభ్యులందరూ సభకు హాజరు కావాలని ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు.
బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, అధికారుల వ్యక్తిగత సహాయకులకు పాసులు జారీ చేయడం లేదని స్పష్టం చేశారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశం ఉండదని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రిని కలిసే సందర్శకులు, ప్రతినిధులను శాసనసభ ప్రాంగణంలోకి అనుమతించరని చెప్పారు. అందుకోసం వచ్చే వారు... సీఎంవోలనే భేటీ కావాల్సి ఉంటుందని సూచించారు. శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. అలాగే పోలీసు శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా అందరికీ వారు విజ్ఞప్తి చేశారు.
సమావేశాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న మీడియా పాయింట్, కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా పరిశీలించి ఈ సందర్భంగా స్పీకర్ పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ కార్యదర్శి జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఇతర ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
For AndhraPradesh News And Telugu News