Kishan Reddy: కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:17 PM
Kishan Reddy: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదిలాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.

ఆదిలాబాద్, ఫిబ్రవరి 23: పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదని చెప్పారు. ఏ ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్ పార్టీకి వచ్చేది మాత్రం గాడిద గుడ్డేనని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోనియా గాంధీ సంతకంతో ఇంటింటి ప్రచారం చేసి ఓట్లు వేయించుకొని ప్రజల్ని ఆ పార్టీ నేతలు మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని చెప్పారు.
Also Read : ఉపాధ్యాయ సంఘాలతో ఎమ్మెల్సీ అభ్యర్థి భేటీ.. కీలక వ్యాఖ్యలు
గత రెండు ప్రభుత్వాలు రూ. 9 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని విమర్శించారు. మన తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఒక సారి గెలిచిన రాష్ట్రంలో మళ్లీ ఆ పార్టీ గెలవడం లేదని ఎద్దేవా చశారు. నిజమైన మార్పు తెలంగాణలో రాలేదని విమర్శించారు.
Also Read : రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
తెలంగాణలో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 27వ తేదీన జరగనున్నాయి. వీటి ఫలితాలు మార్చి 3వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు రంగంలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తుంద్దంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. కాదు కాదు.. బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తుందంటూ బీజేపీ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకొంటున్నారు. అలాంటి వేళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
For Telangana News And Telugu News