Janasena: జనసేన శాసన సభా పక్ష సమావేశంలో కీలక నిర్ణయం
ABN , Publish Date - Feb 23 , 2025 | 08:03 PM
Janasena: జనసేన పార్టీ శాసభ సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సీనియర్ ఎమ్మెల్యేలు మండలి బుద్ద ప్రసాద్, కందుల దుర్గేష్, కొణతల రామకృష్ణ తదితరులు చట్టసభల్లోని తమ అనుభవాలనువ వివరించారు.

అమరావతి, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం మొదలైంది. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ విధానాలను జనసేన ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం చట్టసభల్లో తన అనుభవాలను సీనియర్ ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్‌తోపాటు కందుల దుర్గేష్.. తోటి ఎమ్మెల్యేలతో పంచుకున్నారు.
బడ్జెట్ సమావేశాలు జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పిబ్రవరి 28వ తేదీన సభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పట్టనున్నారు. అసలు అయితే ఈ బడ్జెట్‌ను మార్చి 4వ తేదీన ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తొలుత భావించింది కానీ.. అనివార్య కారణాల వల్ల ఈ బడ్జెట్‌ను నాలుగు రోజుల ముందుకు జరిపింది.
వైసీపీ భాష వద్దు..
ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపిద్దామని పార్టీ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దామని వారికి సూచించారు. మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలన్నారు. వైసీపీ భాష వద్దని జనసేన ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి శాసన సభ్యుడు, మండలి సభ్యులు చర్చల్లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. శాసనసభ సంప్రదాయాన్ని, మర్యాదను కాపాడుతూ హుందాగా ముందుకు వెళ్లాలన్నారు. చట్ట సభలలో ఎంత విలువైన చర్చలు జరిగేవో ఒకసారి అందరూ పరిశీలించాలని.. ఎప్పటికప్పుడు సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకొని చర్చల్లో పాల్గోనాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు.. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడితోపాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భావించారు. అందుకోసం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం సైతం వాయిదా పడింది.
Also Read: బ్రౌన్ రైస్ వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
ఈ నేపథ్యంలో సభలో సభ్యులు ఎలా మసులుకోవాలనే అంశంపై పార్టీ సీనియర్లతో.. కొత్తగా ఎన్నికైన జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఆయనతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా సభను తరలి రానున్నారు.
Also Read: మూడో తరగతి విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాష్టీకం
మరోవైపు.. రేపటి నుంచి 47వ శాసన మండలి, 16వ శాసనసభ మూడవ సమావేశ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తాతో సమీక్షా నిర్వహించారు. గవర్నర్ ప్రసంగం జరిగే రోజు ఉదయం 9.30 గంటలకు సభ్యులందరూ సభకు హాజరు కావాలని ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు.
Also Read : రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
Also Read : ఉపాధ్యాయ సంఘాలతో ఎమ్మెల్సీ అభ్యర్థి భేటీ.. కీలక వ్యాఖ్యలు
బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, అధికారుల వ్యక్తిగత సహాయకులకు పాసులు జారీ చేయడం లేదని స్పష్టం చేశారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశం ఉండదని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రిని కలిసే సందర్శకులు, ప్రతినిధులను శాసనసభ ప్రాంగణంలోకి అనుమతించరని చెప్పారు. అందుకోసం వచ్చే వారు... సీఎంవోలనే భేటీ కావాల్సి ఉంటుందని సూచించారు. శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. అలాగే పోలీసు శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా అందరికీ వారు విజ్ఞప్తి చేశారు.
Also Read: అసెంబ్లీ సమావేశాలకు జగన్ రెడ్డి.. అధికార పక్షం సంచలన వ్యాఖ్యలు
Also Read : కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సమావేశాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న మీడియా పాయింట్, కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా పరిశీలించి ఈ సందర్భంగా స్పీకర్ పలు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ కార్యదర్శి జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఇతర ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
For AndhraPradesh News And Telugu News