Student: మూడో తరగతి విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాష్టీకం
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:55 PM
Student: మూడో తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా కొట్టాడాడు. ఈ ఘటనలో అతడి ముఖంతోపాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాష్టీకానికి పాల్పడ్డాడు. విద్యార్థిపై సదరు ఉపాధ్యాయుడు విచక్షణరహితంగా దాడి చేశాడు. దీంతో విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ దారుణమైన ఘటన మియాపూర్‌లోని మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థి ముఖంతోపాటు శరీరంపై తగిలిన గాయాలు కమిలిపోయాయి. దీంతో ఉపాధ్యాయుడిపై ప్రధానోపాధ్యాయుడికి విద్యా్ర్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
అలాగే తమ కుమారుడిపై దాడి చేసిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో అతడి తల్లిదండ్రులు పిర్యాదు చేశారు. అయితే గతంలో సైతం విద్యార్థులపై సదరు ఉపాధ్యాయుడు ఇదే రీతిలో ఇష్టారాజ్యంగా కర్రతో దాడి చేసినట్లు ఆరోపణలు వినిపించాయి.
మదీనగూడలోని ప్రభుత్వ పాఠశాలలో దేవీ ప్రసాద్ అనే విద్యార్థి 3వ తరగతి చదువుతోన్నాడు. శనివారం స్కూల్‌కు వచ్చిన విద్యార్థి లెక్కలు చేస్తున్నాడు. ఆ క్రమంలో లెక్క తప్పు చేసినందుకు అతడిపై ఉపాధ్యాయుడు తీవ్రంగా దాడి చేశాడు. ఒక తప్పునకు పది దెబ్బలు అన్నట్లుగా ఉపాధ్యాయుడు విద్యార్థి ముఖం, శరీరంపై విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో సదరు విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ దెబ్బలు తాళలేక.. ఆ విద్యార్థి సమీపంలోని తన ఇంటికి వెళ్లాడు. ఈ దాడి విషయాన్ని అతడి తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో వారు ఆగమేఘాల మీద పాఠశాలకు చేరుకొని.. ఉపాధ్యాయుడిని నిలదీశారు. అనంతరం అతడిపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉపాధ్యాయుడిపై విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశాడు.
Also Read: అసెంబ్లీ సమావేశాలకు జగన్ రెడ్డి.. అధికార పక్షం సంచలన వ్యాఖ్యలు
Also Read : రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
అయితే గతంలో సైతం ఇదే విద్యార్థిని సదరు ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడని.. దీంతో అతడి ముక్కుల్లో నుంచి రక్తం కారిందంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దేవీ ప్రసాద్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇదే అంశాన్ని నాడు.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశామని కానీ ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Also Read : ఉపాధ్యాయ సంఘాలతో ఎమ్మెల్సీ అభ్యర్థి భేటీ.. కీలక వ్యాఖ్యలు
పైగా ఉపాధ్యాయుడిలో ఎటువంటి మార్పు రాలేదని.. ఈ కారణంగా మళ్లీ విద్యార్థి దేవీ ప్రసాద్‌పై దాడి చేశాడని ఆ తల్లిదండ్రులు తెలిపారు. ఈ తరహ ఘటన పునరావృతం కావడంతో.. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించామని దేవీ ప్రసాద్ తల్లిదండ్రులువ వివరించారు.
For Telangana News And Telugu News