బ్రౌన్ రైస్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వైట్ రైస్ కంటే ఇది అధిక పోషక విలువలు కలిగి ఉంటుందని పేర్కొంటున్నారు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణం వీటిలో ఉంటుంది. బరువు తగ్గించడంలో సహాయపడే ఫైబర్ ఉంటుంది. డయాబెటిస్ నియంత్రణకు సహాయపడే గ్లైసెమిక్ ఇండెక్స్ సైతం వీటిలో ఉంటాయి.
బ్రౌన్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో ఇవి కణాలను రక్షిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులను నియంత్రిస్తుంది. బ్రౌన్ రైస్‌లో ఉండే లిగ్నాన్స్ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఇవి తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా అన్నవాహిక, కడుపు, పెద్ద పేగు క్యాన్సర్ వంటివి తగ్గుతాయి. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతోన్నాయి.
బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైనది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీనివల్ల శరీర కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. వాపులు తగ్గుతాయి.
బ్రౌన్ రైస్‌లో మాంగనీస్ ఉంటుంది. ఇది ఎముకలకు చాలా మంచిది. ఎముకలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.
ఈ రైస్ డయాబెటిక్ పేషెంట్లకు మంచిది. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
ఈ రైస్ డయాబెటిక్ పేషెంట్లకు మంచిది. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
బ్రౌన్ రైస్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును నియంత్రిస్తుంది.