Share News

RV Karnan: రూ.50 వేల కంటే ఎక్కువ నగదుతో ప్రయాణాలొద్దు..

ABN , Publish Date - Oct 08 , 2025 | 08:14 AM

జూబ్లీహిల్స్‌ శాసనసభ ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ప్రజలకు కీలక సూచన చేశారు.

RV Karnan: రూ.50 వేల కంటే ఎక్కువ నగదుతో ప్రయాణాలొద్దు..

- ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది జాగ్రత్త

- ప్రజలకు హైదరాబాద్‌ ఎన్నికల అధికారి సూచన

హైదరాబాద్‌ సిటీ: జూబ్లీహిల్స్‌ శాసనసభ ఉపఎన్నిక(Jubilee Hills Legislative Assembly by-election)కు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌(RV Karnan) ప్రజలకు కీలక సూచన చేశారు. సరైన పత్రాలు లేకుండా రూ.50 వేల కంటే ఎక్కువ నగదుతో ప్రయాణాలు చేయవద్దని, పట్టుబడితే డబ్బును సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తాయని ప్రకటించారు.


zz.jpg

జూబ్లీహిల్స్‌ శాసనసభ ఉపఎన్నికలకు సంబంధించి జిల్లా ఫిర్యాదుల కమిటీ, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ)లను కర్ణన్‌ ఏర్పాటు చేశారు. తనిఖీల్లో సీజ్‌ చేసిన నగదును సరైన పత్రాలు చూసి ఈ కమిటీనే విడుదల చేస్తుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ భవనం మూడో అంతస్తులో ఈ కమిటీ కార్యాలయం ఉంది. ఇక, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ)కి జిల్లా ఎన్నికల అధికారిచైర్మన్‌గా వ్యవహరిస్తారు.


city3.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

Read Latest Telangana News and Nationa

Updated Date - Oct 08 , 2025 | 08:14 AM