Buses: లింగంపల్లి నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బస్సులు
ABN , Publish Date - May 02 , 2025 | 12:28 PM
లింగంపల్లి నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బీహెచ్ఈఎల్ అధికారులతోపాటు ఇతర వర్గాల వారు విమాన ప్రయాణం చేయాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అలాగే లింగంపల్లిలో రైల్వేస్టేషన్ కూడా ఇటు రైల్వే, అటు విమాన ప్రయాణానికి వీలుగా ఆర్టీసీ సిటీస్సులను ఏర్పాటు చేసింది. ఆ బస్సుల సమయం వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్: విదేశాలు, ఇతర రాష్ట్రాలకు విమానంలో వెళ్లే ప్రయాణికుల కోసం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు టీజీఎస్ ఆర్టీసీ బస్ ప్రయాణికుల సౌకర్యార్ధం ఆర్‌టీసీ పుష్పక్ ఏసీ బస్సులను నడుపుతోంది. ఈ బస్సులు లింగంపల్లి ప్రధాన బస్టాండ్ నుండి ప్రతీ రోజు ఉదయం 5.45 నుండి రాత్రి 10.30 వరకు ఉంటాయి. పుష్పక్ బస్సుల రాకపోకల వేళలు.
ఈ వార్తను కూడా చదవండి: Trains: గద్వాల, కర్నూల్ మీదుగా తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లు

లింగంపల్లి బస్టాండ్ నుండి..
తెల్లవారుజామున 5.45 ఉదయం - 6.35, 7.25, 8.15, 9.05, 9.55, 10.45, 11.35. మధ్యాహ్నం - 14.55, 15.45, సాయంత్రం - 16.35, 17.25, 18.15.
రాత్రి - 19.05, 19.55, 2045.
విమానాశ్రయం నుండి లింగంపల్లికి వచ్చే బస్సుల వేళలు
ఉదయం - 7.30, 8.20, 9.10, 10.00, 10.50, 11.40.
మధ్యాహ్నం - 12.30, 13.20., సాయంత్రం - 16.40, 17.30, 18.20
రాత్రి - 20.00, 20.50, 21.40, 22.30.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..
Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం
Gold Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత
Read Latest Telangana News and National News