New Year: న్యూ ఇయర్ రోజున 2 ఎంఎంటీఎస్ స్పెషల్స్
ABN , Publish Date - Dec 26 , 2025 | 06:58 AM
నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని 2 ఎంఎంటీఎస్ స్పెషల్స్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు, నాంపల్లి రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.
హైదరాబాద్ సిటీ: న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. జనవరి 1న తెల్లవారు జామున 1.15 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరే ఎంఎంటీఎస్ రైలు, చందానగర్, హఫీజ్‌పేట్, హైటెక్‌సిటీ, బోరబండ, భరత్‌నగర్, బేగంపేట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ స్టేషన్ల మీదుగా నాంపల్లి రైల్వేస్టేషన్(Nampally Railway Station)కు 1.55కు చేరుకుంటుంది. అలాగే, అదేరోజు తెల్లవారుజామున 1.30 గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు మరొక ఎంఎంటీఎస్ సర్వీసును నడుపుతున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News
