Share News

BJP: ప్రజల్లో ఆదరణ చూసి ఓర్వలేకే ఎమ్మెల్యే అక్కసు..

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:42 PM

భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అటు బీజేపీ, ఇటు తనపై నాపై అసత్య ప్రచారాలు చేసి తన అక్కసు వెల్లగక్కుతున్నారని బీజేపీ సీనియర్ నేత కొప్పుల నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

BJP: ప్రజల్లో ఆదరణ చూసి ఓర్వలేకే ఎమ్మెల్యే అక్కసు..

- నామ మాత్రపు సమాచారంతో నేను లేకుండా శంకుస్థాపనలు

- నేను కొట్లాడి తెచ్చిన పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొడుతుండు

- జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ నర్సింహారెడ్డి

హైదరాబాద్: ప్రజల్లో తనపై వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి(MLA Sudheer Reddy) తన అనుచరులతో నాపై అసత్య ప్రచారాలు చేసి తన అక్కసు వెల్లగక్కుతున్నారని మన్సూరాబాద్‌ కార్పొరేటర్‌, జీహెచ్‌ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కొప్పుల నర్సింహారెడ్డి(Koppula Narasimha Reddy) విమర్శించారు. నామ మాత్రపు సమాచారమిచ్చి తాను లేకుండా డివిజన్‌ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడాన్ని విలేకరుల సమావేశంలో కార్పొరేటర్‌ తీవ్రంగా ఖండించారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌ అభివృద్ధిలో భాగంగా అధికారులతో తాను కొట్లాడి తెచ్చిన రూ.1.58కోట్ల నిధుల్లో భాగమే ఎమ్మెల్యే రూ.71లక్షలతో శంకుస్థాపన చేసిన పనులని, ఆ కార్యక్రమానికి వస్తే మంచిపేరు వస్తుందనే అక్కసుతో తనకు నామ మాత్రపు సమాచారమిచ్చారని ఆరోపించారు. తన కృషితో పాటు ఎంపీ ఈటల రాజేందర్‌ చొరవతోనే మన్సూరాబాద్‌లో అభివృద్ధి పరుగులు పెడుతోందని, ఇందులో ఎమ్మెల్యేది నామ మాత్రపు పాత్రేనని ఆరోపించారు.


city10.2.jpg

ఏడాది పాటు ఎమ్మెల్యే అందుబాటులో లేకున్నా డివిజన్‌ అభివృద్ధిని ఎంపీ సహకారంతో పరుగులు పెట్టించామని, ఇంకా డివిజన్‌లో రూ.4కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని కార్పొరేటర్‌ పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ డివిజన్‌ అధ్యక్షుడు మునగాల హరీ్‌షరెడ్డి, నాయకులు యంజాల్‌ జగన్‌, పాతూరి శ్రీధర్‌గౌడ్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, పారంద సాయి తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వాయిదా పడినా.. పట్టు వీడలేదు

మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

మంద కృష్ణ మా నాయకుడు కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 13 , 2025 | 12:55 PM