Share News

MLA: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:15 PM

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ తలొంచకుండా సక్రమ నిర్మాణాలు చేపట్టాలంటూ సంబంధిత అధికారుకు ఆయన సూచనలు చేశారు. అక్రమంగా చేపడుతున్న కట్టడాల వద్ద వసూళ్లకు మరిగి వత్తాసు పలుకుతున్నారంటూ ఆయన విమర్శించారు.

MLA: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

- ఎవరికీ తలొంచకుండా సక్రమ నిర్మాణాలు చేపట్టండి

- ప్రజలకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచన

- దౌత్య నియమాలు పాటించకుండా కొందరి కార్పొరేటర్ల తీరు

- ఎవరెన్ని కుట్రలు పన్నినా అభివృద్ధి పనులను ఆపం

హైదరాబాద్: నియోజకవర్గంలోని కొందరు కార్పొరేటర్లు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా చేపడుతున్న కట్టడాల వద్ద వసూళ్లకు మరిగి వత్తాసు పలుకుతున్నారని, వారి మాటలు నమ్మి మోసపోకుండా అన్ని నిబంధనలతో ఎవరికీ తలొంచకుండా నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudheer Reddy) ప్రజలకు సూచించారు. మన్సూరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో రూ.71లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Secundrabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం..


అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరస్వతీనగర్‌లో రూ.18లక్షలతో నీటి స్తబ్దత తొలగింపు, సీసీ రోడ్ల నిర్మాణం, రూ.10లక్షల అంచనా వ్యయంతో వీరన్నగుట్టలో ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు, టీ.నగర్‌లో రూ.11 లక్షలతో, వీరన్నగుట్టలో రూ.10.50లక్షలతో, విజయ్‌నగర్‌ కాలనీలో రూ. 21.50లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశామన్నారు. హతిగూడ చెరువుకు ఎఫ్‌టీఎల్‌ పరిధి ఉన్నప్పటికీ కొందరు బీజేపీ నాయకులు తమతో సత్సంబంధంగా ఉన్నవారి ప్లాట్లను టార్గెట్‌ చేసుకుని వారి ప్లాట్ల గుండా కందకం తొలగిస్తున్నారన్నారు.


మన్సూరాబాద్‌లోని శివంహిల్స్‌, టీ.నగర్‌, దుర్గానగర్‌, వీరన్నగుట్ట ప్రాంతాల్లో మరెన్నో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని, వాటిని త్వరలోనే చేపడతామన్నారు. విజయవాడ నేషనల్‌ హైవే ఎత్తుగా ఉండడంతో దానికి ఆనుకుని ఉన్న కాలనీల్లోకి రాకపోకలు సాగించడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యూటర్న్‌ లేక తలెత్తుతున్న ఇబ్బందులను రహదారి పనులు పూర్తయిన వెంటనే అవసరమైన చోట యూటర్న్‌ ఏర్పాటు చేసేలా ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తానన్నారు.


నియోజకవర్గంలో కనీసం దౌత్య నియమాలు పాటించని అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‏కు చెందిన కొందరు కార్పొరేటర్లు, నాయకులు కుట్రలు పన్నుతున్నారని, వారి కుట్రలను నియోజకవర్గ ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే విశ్వసించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు పోచబోయిన జగదీశ్‌యాదవ్‌, కొసనం వెంకట్‌రెడ్డి, జక్కిడి రఘువీర్‌రెడ్డి, రుద్ర యాదగిరి, అనిల్‌కుమార్‌, కేకేఎల్‌ గౌడ్‌, నర్సింగ్‌రావు, ఆనంద్‌యాదవ్‌, మహేష్‌, భాస్కర్‌, ఆయా కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వాయిదా పడినా.. పట్టు వీడలేదు

మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

మంద కృష్ణ మా నాయకుడు కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 13 , 2025 | 12:43 PM