Share News

Telangana High Court Stay ON Local Elections: తెలంగాణ హైకోర్టు స్టే.. ఆ ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:42 AM

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి.

Telangana High Court Stay ON Local Elections: తెలంగాణ హైకోర్టు స్టే.. ఆ ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా
Telangana High Court Stay ON Local Elections

హైదరాబాద్, సెప్టెంబరు29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను (Local body Election) ఇవాళ(సోమవారం) విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (Telangana Election Commission). మొదట ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) నిర్వహించనుంది ఎన్నికల సంఘం. అయితే రాష్ట్ర హైకోర్టు (Telangana High Court) స్టే కారణంగా తెలంగాణలో 14 ఎంపీటీసీ, 27 గ్రామపంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికలు వాయిదా పడనున్నాయి.


మూడు విడతల్లో పంచాయతీ వార్డు ఎన్నికలు..

కాగా, మూడు విడతల్లో గ్రామపంచాయతీ వార్డు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో 1998 గ్రామపంచాయతీలు ఉండగా.. 17 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండో విడతలో 5414 గ్రామపంచాయతీలు ఉండగా.. 47,890 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. మూడో విడతలో 5521 గ్రామపంచాయతీలు ఉండగా.. 47,788 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.


రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు...

రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో 2963, రెండో విడతలో 2786 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. మొదటి విడతలో 292, రెండో విడతలో 273 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. మరో గొప్ప పథకం ప్రారంభం

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ.. స్పీకర్‌ నిర్ణయంపై ఉత్కంఠ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 29 , 2025 | 05:10 PM