Share News

MLA: ఎమ్మెల్యే మాధవరం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారంటే..

ABN , Publish Date - Sep 05 , 2025 | 10:45 AM

కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. బోయిన్‌చెరువు కట్టమైసమ్మ ఆలయం నుంచి హస్మత్‌పేట డంప్‌ యార్డు వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్‌ నర్సింహ యాదవ్‌తో కలిసి గురువారం ఎమ్మెల్యే పనులను ప్రారంభించారు.

MLA: ఎమ్మెల్యే మాధవరం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారంటే..

- కాంగ్రెస్‌ పాలనలో కుంటుపడిన అభివృద్ధి

- కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు

హైదరాబాద్: కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) ఆరోపించారు. బోయిన్‌చెరువు కట్టమైసమ్మ ఆలయం నుంచి హస్మత్‌పేట డంప్‌ యార్డు వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్‌ నర్సింహ యాదవ్‌తో కలిసి గురువారం ఎమ్మెల్యే పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఓల్డుబోయినపల్లి హస్మత్‌పేట బోయిన్‌చెరువును అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీనిచ్చారు. కోటి రూపాయలతో చేపట్టబోతున్న సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే అంజయ్యనగర్‌ వైపుకు వెళ్లే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు.


city7.2.jpg

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ది పనుల కోసం నిధులు మంజూరైనప్పటికి పనుల్లో జాప్యం నెలకొంటుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం శ్రీశ్రీనగర్‌లో రూ.20లక్షలు, ఇందిరానగర్‌లో రూ.55 లక్షలతో చేపట్టిన తాగునీటి పైప్‌లైన్‌ పనులకు కార్పొరేటర్‌ ఆవుల రవీందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు జంగయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీశ్రీనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దుర్గేష్‌, ఇందిరానగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గిరిసాగర్‌, అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి

‘గే’ యాప్‌ ‘గ్రైండర్‌’ ద్వారా డ్రగ్స్‌ విక్రయం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 05 , 2025 | 10:45 AM