Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంకు ప్రమాద హెచ్చరిక జారీ..
ABN , Publish Date - Aug 31 , 2025 | 09:41 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతున్న కారణంగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వర్షాలకు వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ మేరకు గోదావరి, మూసి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదులకు ఇంకా వరద ప్రవాహం తీవ్రంగా కొనసాగుతోంది. కాగా, రాష్ట్రానికి ఇంకా వర్ష సూచన ఉండటంతో.. పలు జిల్లాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల ప్రజలు కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతున్న కారణంగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే.. 43 అడుగుల నీటిమట్టం వద్ద మొదటి హెచ్చరిక జారీ చేయగా.. ఇప్పుడు నీటిమట్టం 48 అడుగులకు చేరుకోవడంతో రెండవ హెచ్చరిక ప్రకటించారు. దీంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..
జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..