Minister Tummala: ఖమ్మం వాసులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలో..
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:37 PM
ఖమ్మంలో ప్రపంచస్థాయి డిజైన్‌తో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేస్తున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ పూర్తి కావొచ్చిందని వెల్లడించారు. ఖిల్లాకు రోప్ వే పనులు ప్రారంభమయ్యాయని.. జూన్ నాటికి మున్నేటిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఖమ్మం: జిల్లాను అన్ని విధాలా నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్(Khammam Collectorate)లో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్(Congress Govt) చేపడుతున్న పనులను వివరించారు. పర్యాటక ప్రాంతంగా ఖమ్మంను అభివృద్ధి చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి.
ప్రపంచస్థాయి డిజైన్‌తో నగరంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేస్తున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ పూర్తి కావొచ్చిందని వెల్లడించారు. ఖిల్లాకు రోప్ వే పనులు ప్రారంభమయ్యాయని.. జూన్ నాటికి మున్నేటిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పూర్తి కావొచ్చిందని.. అలాగే శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మెడికల్ కళాశాల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఖమ్మంలో హరిత హోటల్ నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు. 20ఎకరాలను టీటీడీకి అందజేస్తున్నామని.. వారి ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు.
మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ మిగిలిన అన్ని చెరువులకూ కృష్ణా జలాలు అందజేస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో రాబోయే జూన్ నాటికి 25 వేల ఎకరాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగు నీరు అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. టన్నెల్స్ అన్నింటినీ శరవేగంగా పూర్తి చేసి అన్నదాతలకు సాగు నీరు అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. పాలేరుకు గోదావరి జలాలు వస్తేనే సీతారామ లక్ష్యం పూర్తవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు తుమ్మల. మరోవైపు స్వామి నారాయణ స్కూల్ నిర్మాణం జరుగుతోందని.. వెలుగుమట్ల అర్బన్ పార్క్ నిర్మాణం పూర్తి చేసి మంచి మ్యూజియం, పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: ఇంత బతుకు బతికి ఏ పార్టీనో చెప్పుకునే దమ్ము లేదు: కేటీఆర్ ఫైర్
BJP State President Ramachandra Rao: పంచాయతీ ఎన్నికలపై