Panchayat Elections In Telangana: నకిలీ కుల ధృవీకరణతో సర్పంచ్ పదవి.. ఆందోళనకు దిగిన గ్రామస్తులు..
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:25 PM
నకిలీ కుల ధృవీకరణ పత్రంతో ఎన్నికల బరిలో నిలిచి సర్పంచ్‌గా ఎన్నికైనట్లు గ్రామస్తులు గుర్తించారు. అతడిని వెంటనే డిస్మిస్ చేసి.. మళ్లీ గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను గ్రామస్తులు డిమాండ్ చేశారు.
కామారెడ్డి, డిసెంబర్ 19: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయి.. ఆ వెంటనే ఫలితాలు సైతం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో నకిలీ కుల ధృవీకరణ పత్రంతో సర్పంచ్ పదవికి ఎన్నికైనట్లు గ్రామస్తులు తాజాగా గుర్తించారు. దాంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వారంతా చేరుకుని ఆందోళన బాట పట్టారు. అతడిని సర్పంచ్ పదవి నుంచి వెంటనే తొలగించి.. మళ్లీ గ్రామ పంచాయతీ ఎన్నిక నిర్వహించాలంటూ కలెక్టరేట్ ఎదుట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని రాజంపేట మండలం అన్నారం గ్రామం ఎస్టీ రిజర్వుడ్‌గా నిర్ణయించారు. ఈ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా రవీందర్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో అతడు సర్పంచ్‌గా విజయం సాధించాడు. అయితే అతడు ఎస్టీ కాదని.. నకిలీ కుల ధృవీకరణ పత్రం ద్వారా ఈ ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆ తర్వాత గ్రామస్తులు గుర్తించారు. దాంతో శుక్రవారం ఉదయం కామారెడ్డి జిల్లా కలెకర్ట్ కార్యాలయానికి గ్రామస్తులంతా చేరుకుని.. ఆందోళన చేపట్టారు.
తప్పుడు కుల ధృవీకరణ పత్రం ద్వారా రవీందర్ ఈ ఎన్నికల బరిలో నిలిచి గెలిచారంటూ విమర్శించారు. అతడిని సర్పంచ్ పదవి నుంచి డిస్మిస్ చేసి.. గ్రామ పంచాయతీకి మళ్లీ ఎన్నిక నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలోని ఏవోకు అన్నారం గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించడం వైసీపీ తరం కాదు: మంత్రి లోకేశ్
నియామకాల్లో పారదర్శకత ముఖ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
For More Telangana News And Telugu News