Share News

New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Jan 17 , 2025 | 01:02 PM

minister Ponnam Prabhakar: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు.

New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
New Ration Cards

కరీంనగర్: జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తెలంగాణలో 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. ప్రజా పాలనపై ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. పాత రేషన్ కార్డులు తొలగించడం లేదని స్పష్టం చేశారు.కుల సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.


కాగా.. ఆరు గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే పలు హామీలను రేవంత్ ప్రభుత్వం అమలు చేసింది. ఈ మేరకు రేషన్ కార్డులపై రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్ కార్డులను ఈ నెల26 నుంచి జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.


కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపనుంది. మండల స్థాయిలో ఎంపీడీఓతోపాటు యూఎల్‍బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లేదా జీసీఎస్ఓ పర్యవేక్షకులుగా ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated Date - Jan 17 , 2025 | 01:04 PM